భారత్- పాక్ సరిహద్దుల్లో హైటెన్షన్ నెలకొంది. భారత బలగాలపై పాకిస్థాన్ డ్రోన్ దాడులకు దిగుతోంది. కుప్వారా, బారాముల్లా, పుంఛ్, రాజౌరీ, అఖ్నూర్ సెక్టర్‌పై పాక్ రేంజర్లు కాల్పులకు తెగబడుతున్నారు. అయితే పాకిస్థాన్‌కు చెందిన డ్రోన్లను భారత బలగాలు కూల్చివేశాయి. మరోవైపు నుంచి ఆర్మీ బలగాలు అటాక్‌కు దిగడంతో పాక్ సైన్యానికి భారీ నష్టం జరిగినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జమ్ములోని చీనాబ్ రీజన్‌లో స్థానిక ప్రజలకు భద్రత బలగాల హెచ్చరించాయి. ఇప్పుడే జనజీవనం బయటకు రావొద్దంటూ సైరన్ మోగించి మైకులో అనౌన్స్ చేస్తున్నారు ఆర్మీ అధికారులు..