సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్యం విషమంగా ఉంది. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ని కొద్ది రోజుల క్రితమే ఢిల్లీ లోని ఎయిమ్స్ ఆసుపత్రిలో అడ్మిట్ చేసి ట్రీ ట్ మెంట్ అందిస్తున్నారు. అయితే 72 ఏళ్ల సీతారాం ఏచూరి కొద్దిగా కోలుకున్నారని భావించిన సమయంలోనే ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో గత నెల 19న ఆయన్ని ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేర్చించారు. అయితే వైద్యుల పర్యవేక్షణలో ట్రీట్ మెంట్ పొందుతున్న ఆయన హెల్త్ కండీషన్ కొద్దిగా పర్వాలేదు అనుకుంటున్న సమయంలో మళ్లీ విషమంగా మారడంతో డాక్టర్లు, పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు.
ప్రస్తుతం వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్న ఎయిమ్స్ వైద్యుల బృందం ఆయన్ని సాధారణ స్థితికి తీసుకురావడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆగస్టు 19న తీవ్ర జ్వరంతో ఏచూరి ఢిల్లీ ఎయిమ్స్ లో చేరిన తర్వాత శ్వాస సమస్యలు మరింత ముదిరాయి. ఏచూరికి ఇటీవల కంటి ఆపరేషన్ జరిగింది.