మాజీ మేయర్ చెప్పు ఎత్తుకెళ్లిన కుక్క

నాలుగు కుక్కలకు స్టెరిలైజేషన్

Update: 2023-06-15 03:15 GMT


కుక్క చెప్పు ఎత్తుకెళ్లడం అనేది సర్వసాధారణ విషయం. అది మీ ఇంట్లోనో, నా ఇంట్లోనో జరిగితే కుక్కలన్నింటినీ కలిపి నాలుగు తిట్లు తిట్టుకుంటాం తప్ప ఎవరికీ చెప్పుకోలేం. ఎందుకంటే గట్టిగా రాయి వేస్తే బ్లు క్రాస్ వాళ్ళు వచ్చేస్తారు మద్దతు పలకడానికి.

పోనీ మున్సిపాలిటీ వాళ్లకి చెబుదామా అంటే వాళ్ళు కూడా సామాన్య ప్రజలకోసం అంటే చాలా సులువుగా తీసుకుంటారు. మీ ఇంటి గేట్ మీరే వేసుకోవాలి అని సలహా కూడా ఇస్తారు కానీ అదే కుక్క ఒక మాజీ మేయర్ చెప్పు ఎత్తుకెళ్ళితే ఏం జరుగుతుందో తెలుసా.

రండి.. ఆ సంఘటన వివరాల్లోకి వెళదాం.

మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లోని నక్షత్రవాడి ప్రాంతంలో నగర మాజీ మేయర్ నంద్‌కుమార్ నివాసం ఉంటున్నారు. అయితే గత రాత్రి ఆయన తన ఇంటిముందు విడిచిన చెప్పులు కనిపించకుండా పోయాయి. అప్పటికే ఇంటి గేటు తెరచి ఉంది. గేటు తెరచి ఉండటంతో వీధి కుక్కలు వచ్చి ఎత్తుకెళ్లాయని ఆయన కుటుంబీకులు అనుమానించారు. దీంతో ఆ మాజీ మేయర్ మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు.

తర్వాత రోజు రంగంలోకి జరిగిన ఔరంగాబాద్ మన్సిపల్ అధికారులు.విధి కుక్కలను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు మేయర్ ఇంటి దగ్గర్లో ఉండే నాలుగు కుక్కలను పట్టుకున్నారు. అనంతరం వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ (స్టెరిలైజేషన్) చేశారు. అయితే వీధి కుక్కలకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా, ఆ ఫిర్యాదు ఎవరు చేసినా  సిబ్బందిని పంపించి వాటిని పట్టుకునే ప్రక్కియ సాధారణంగా జరుగుతుందని ఏఎంసీ అధికారులు చెబుతున్నారు. ఈ మాటల్లో నిజం ఎంతో మనకి తెలిసిందేగా.

Tags:    

Similar News