Smriti Irani : 'ఇరానీ' రెస్టారెంట్‌కు షోకాజ్ నోటీసులు..
Smriti Irani : కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కుటుంబానికి ఎక్సైజ్ నోటీసులు జారీ అయ్యాయి;
Smriti Irani : కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కుటుంబానికి ఎక్సైజ్ నోటీసులు జారీ అయ్యాయి. కూతురు జోయిష్ ఇరానీకి చెందిన సిల్లీ సౌల్స్ రెస్టారెంట్ తప్పుడు పత్రాలతో లైసెన్స్ పొంది నిర్వహిస్తున్నట్లు తేలింది. స్మృతి ఇరానీ కూతురు నడుపుతున్న రెస్టారెంట్ లైసెన్స్ పాత యజమాని పేరుపై ఉంది. అతను గత సంవత్సరం మేలో మరణించాడు. అయితే మరణించిన అతనిపైనే మళ్లీ గత నెల జూన్‌లో లైసెన్స్‌ను 2022 నుంచి 2023 వరకు రిన్యవల్ చేయించారు.
ఇలా అక్రమంగా లైసెన్స్ పొందిన విషయాన్ని లాయర్ రొడ్రిగ్స్ కనుగ్గొన్నారు. ఆర్టీఐ ద్వారా పత్రాలు సాధించారు. స్థానిక ఎక్సైజ్ అధికారులు కలిసి ఈ అక్రమానికి పాల్పడ్డారని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా స్మృతి ఇరానీ కూతరు తన సిల్లీ సౌల్స్ రెస్టారెంట్‌లో విదేశీ మద్యం సరఫరా చేస్తున్నట్లు ఎక్సౌజ్ అధికారులకు ఫిర్యాదు చేశారు.