ప్రజలు ఒకరినొకరు కర్రలతో కొట్టుకోవడం, తన్నుకోవడానికి సంబంధించిన ఓ హింసాత్మక ఘర్షణ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇది ఆ ప్రాంతంలో శాంతిభద్రతలపై ఆందోళనలు రేకెత్తిస్తోంది. నివేదికల ప్రకారం, ఒక వ్యక్తి తన ఫోన్‌లో తన స్టేటస్‌గా పోస్ట్ చేసిన రీల్‌పై రెండు గ్రూపులు వాగ్వాదానికి దిగాయి. ఈ వాదన వెంటనే హింసాత్మకంగా మారింది. ఈ గందరగోళం కెమెరాలో రికార్డయింది. ఈ వీడియోని Xలో @kamleshksingh షేర్ చేసారు. ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లాలోని జమ్‌దర్‌పూర్ గ్రామంగా పిలువబడే అమీపూర్ సుధాలో ఈ సంఘటన జరిగింది. మొబైల్ ఫోన్‌లో ఈ అసభ్యకరమైన స్టేటస్ పెట్టడంపై ఫైజాన్, నదీమ్ గొడవ పడ్డారని నివేదికలు చెబుతున్నాయి.
ఈ ఘర్షణలో మహిళలతో పాటు పలువురు గాయపడ్డారు. వ్యక్తులు ఒకరిపై ఒకరు కర్రలతో ఎలా దాడి చేసుకుంటున్నారో, ఒకరినొకరు తన్నుకుంటున్నారో వీడియోలో చూడవచ్చు. పోలీసులకు సమాచారం అందించిన వెంటనే బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఫైజాన్, నజీమ్, నయీమ్ సహా 13 మందిపై ఇస్లాముద్దీన్ అనే వ్యక్తి ఫిర్యాదు చేసినట్లు స్థానిక మీడియా నివేదికలు తెలిపాయి. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
ఉత్తరప్రదేశ్‌లో పనికిమాలిన విషయాలపై హింసాత్మక ఘర్షణలు చోటు చేసుకోవడం ఇదేం మొదటిసారి కాదు. ఈ ఘర్షణల్లో తీవ్ర గాయాలపాలయ్యే పరిస్థితులు కూడా ఏర్పడుతాయి. యూపీలోని ముజఫర్‌నగర్‌లోని ఫులత్ గ్రామంలో ఫిబ్రవరిలో నివేదించబడిన షాకింగ్ సంఘటనలో, ప్రేమ వివాహం కోసం రెండు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలలో ఇద్దరు వ్యక్తులు మరణించారు, అనేకమంది గాయపడ్డారు. రెండు వర్గాలు ఒకే కులానికి చెందినవారని పోలీసులు తెలిపారు. ఈ జంట తమ కుటుంబాలకు వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ తీవ్ర రూపం దాల్చి ఆయుధాలు ప్రయోగించడంతో మరణాలు, గాయాలయ్యాయి.
फैजान ने REEL डाली। नदीम ने कमेंट किया। बस फिर क्या, लट्ठ बज गए। कई घायल हो गए। फैजान पर FIR हो गई है।
— Sachin Gupta (@SachinGuptaUP) April 12, 2024
📍बिजनौर, उत्तर प्रदेश pic.twitter.com/KcyEqZJaEI