Sonia Gandhi: ఆసుపత్రిలో సోనియా గాంధీ.. కాంగ్రెస్ పార్టీ అధికారికంగా వెల్లడి..
Sonia Gandhi: సోనియా గాంధీ మరోసారి అనారోగ్యం పాలయ్యారు.. ఢిల్లీలోని గంగారాం ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు.;
Sonia Gandhi: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మరోసారి అనారోగ్యం పాలయ్యారు.. ఢిల్లీలోని గంగారాం ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు.. కోవిడ్ సంబంధిత ఇబ్బందుల కారణంగానే ఆస్పత్రిలో చేరినట్లు కాంగ్రెస్ పార్టీ అధికారికంగా వెల్లడించింది.. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని.. వైద్యులు పర్యవేక్షిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సుర్జేవాలా తెలిపారు.. కొద్ది రోజుల క్రితమే కరోనా బారిన పడ్డారు సోనియా గాంధీ.. ఆ కారణంగా హోం ఐసోలేషన్‌లోనే ఉండిపోయారు..