Sonia Gandhi Mother : సోనియా గాంధీ కుటుంబంలో తీవ్ర విషాదం..
Sonia Gandhi Mother : కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది;
Sonia Gandhi Mother : కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తల్లి పౌలా మైనో ఇటలీలో కన్నుమూశారు. ఈనెల 27న ఇటలీలోని తన ఇంట్లో ఆమె తుదిశ్వాస విడిచారు. మంగళవారం పౌలా మృతదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. పౌలా మైనో వయసు 90ఏళ్లు పైనే ఉంటుంది. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమెను పరామర్శించేందుకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఈనెల 23న ఇటలీ వెళ్లారు. కుమారుడు రాహుల్‌గాంధీ, కుమార్తె ప్రియాంకాగాంధీ కూడా ఆమెకు తోడుగా వెళ్లారు.