Double Decker Flyover : సౌత్ లో తొలి డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ ప్రారంభం

Update: 2024-07-18 07:18 GMT

సౌతిండియాలో తొలి డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ కర్ణాటకలో ప్రారంభమైంది. రూ.449 కోట్లతో బెంగళూరులో నిర్మించిన ఫ్లైఓవర్ ను డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభించారు. దక్షిణ భారతదేశంలోనే తొలి డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ గా రికార్డు సృష్టించింది.

3.36 కిలోమీటర్ల పొడవైన ఫ్లైఓవర్ నిర్మించారు. ఈ ఫ్లైఓవర్.. సిల్క్ బోర్డు జంక్షన్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ ట్రాఫిక్ ను సులభతరం చేయనుంది. రాగిగుడ్డ మెట్రో స్టేషన్ నుంచి ఫ్లైఓవర్ ప్రారంభం అవుతుంది. వాహనాల రాకపోకల కోసం ఎగువ డెక్ లో ఎలివేటెడ్ మెట్రో కారిడార్ మరియు దిగువ డెక్లో ఎలివేటెడ్ రోడ్డును కలిగి ఉంది. ఈ ఫ్లైఓవర్ రోడ్డు, మెట్రో ఫ్లైఓవర్ రెండింటినీ కలిగి ఉంది. ఇందులో ఐదు వేర్వేరు ర్యాంప్ లు ఉన్నాయి.

మూడు ర్యాంపుల పనులు పూర్తికాగా.. రెండు విభాగం నిర్మాణ దశలో ఉంది. దక్షిణ భారతదేశంలో ఇలాంటి డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మించడం ఇదే తొలిసారి. ఈ ఫ్లై ఓవర్ 3.36 కి.మీ పొడవుతో రాగిగుడ్డ మెట్రో స్టేషన్లో ప్రారంభమై సిల్బోర్డ్ జంక్షన్లో ముగుస్తుంది. ఫ్లైఓవర్తో పాటు వెళ్లే పసుపు లైన్ మెట్రో పనులు ఇంకా పూర్తికాలేదు. బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రకారం ఇది ఈ ఏడాది డిసెంబర్లో ప్రారంభమవుతుంది. నగరంలోని ఏ వైపు నుంచి అయినా 30-40 నిమిషాల సమయం ఆదా అవుతుంది. రెండు ర్యాంప్ల నిర్మాణం మే 2025 నాటికి పూర్తవుతుంది.

Tags:    

Similar News