"స్టోరీ టైమ్ విత్ సుధా అమ్మ".. చిన్నారుల కోసం యానిమేటెడ్ సిరీస్
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సతీమణి సుధా మూర్తి గొప్ప రచయిత్రి. ఆమె చిన్నారుల కోసం కథల పుస్తకాలెన్నో రాశారు.;
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సతీమణి సుధా మూర్తి గొప్ప రచయిత్రి. ఆమె చిన్నారుల కోసం కథల పుస్తకాలెన్నో రాశారు. పిల్లలకు స్ఫూర్తినిచ్చే ఆ కధలు వారిని ఎంతగానో అలరిస్తుంటాయి. ఇంతవరకు అవి పుస్తక రూపంలో చదువరులకు మాత్రమే అందుబాటులో ఉండేవి. అయితే ఇప్పుడు వాటిని యానిమేటెడ్ సిరీస్ లోకి తీసుకు వచ్చారు.
ఈ విషయాన్ని ఆమె కుమారుడు రోహన్ మూర్తి లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో పంచుకున్నారు. "సుధా మూర్తి అత్యంత ఇష్టపడే పుస్తకాలపై ఆధారపడిన పిల్లల యానిమేషన్ సిరీస్ "స్టోరీ టైమ్ విత్ సుధా అమ్మ" యొక్క రాబోయే ప్రారంభోత్సవాన్ని ప్రకటించినందుకు నేను సంతోషిస్తున్నాను" అని నిర్మాత అపర్ణ కృష్ణన్ లింక్డ్‌ఇన్‌లో పోస్ట్ చేసారు.
"గత కొన్ని సంవత్సరాలుగా పిల్లలు, వారి తల్లిదండ్రుల నుండి వేలాది ఉత్తరాలు, ఇమెయిల్‌ల ద్వారా ప్రోత్సహించబడిన, మా అమ్మ తన కథలను పిల్లల కోసం ఒక యానిమేటెడ్ సిరీస్‌కి అందించడానికి అంగీకరించింది" అని రోహన్ మూర్తి పేర్కొన్నారు. 'సుధ అమ్మతో స్టోరీ టైమ్' ఈ కార్యక్రమం అక్టోబర్ 31, 2023న ప్రారంభమవుతుంది. ఈ కథలు 6 భాషలలో (ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, కన్నడ, తెలుగు, తమిళం)లో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఈ సిరీస్ పిల్లల కోసం ప్రతి చోటా ఉచితంగానే అందుబాటులో ఉంటుందని రోహన్ తెలియజేశారు.
“నేను మీ కోసం రాసిన ఈ పాత్రలన్నీ నా మనసులోకి వస్తాయి, నాతో మాట్లాడతాయి. వారిలో కొందరు కొంటెగా ఉంటారు, మరికొందరు చాలా ధైర్యంగా ఉంటారు, మరికొందరు భయపడతారు. నేను వారి సహవాసాన్ని ఆస్వాదించాను, అవి యానిమేషన్ చిత్రాలు.. మీరు కాదు. వారు ఏ రంగు దుస్తులు ధరిస్తారో, వారు ఎంత అల్లరిగా ఉన్నారో, ఎంత ధైర్యంగా ఉన్నారో మీకు చూపించడానికి నేను వారిని సజీవంగా తీసుకురావాలనుకుంటున్నాను" అని సుధా మూర్తి వీడియోలో వివరించారు.