Traffic Violations : మైనర్లకు బండి ఇస్తే రూ.25 వేలు ఫైన్

Update: 2024-05-29 05:19 GMT

మీ బండి మైనర్ చేతికిచ్చారా... అయితే మీకు రూ.25 వేలు ఫైన్ పడుతుంది. రూల్స్ కఠినంగా అమలు చేయాలని డిసైడయ్యారు ట్రాఫిక్ పోలీసులు. వాహన చట్టంలో కీలక మార్పులు జూన్ 1 నుంచి అమలులోకి తేనున్నారు. ప్రజలు ఇకపై అప్రమత్తంగా ఉండాల్సిందే. అడ్డగోలుగా వాహనాలు నడుపుతామని, "కొద్ది మొత్తాలే కదా ఫైన్లు కడతామంటే చట్టాలు ఒప్పుకోవు. మైనర్ల డ్రైవింగ్ కారణంగా ప్రమాదాలు పెరిగిపోవడంతో చట్టాలు కఠినతరం చేసింది ప్రభుత్వం. శిక్షలతోపాటు, భారీగా జరిమానాలు అమలులోకి తీసుకురానున్నారు.

అతివేగంతో వాహనం నడిపితే రూ.1000 నుంచి రూ.2వేల వరకు జరిమానా, లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతూ పట్టుబడితే రూ.500, మైనర్ వాహనం నడిపితే భారీ మొత్తంలో రూ. 25వేల చొప్పున జరిమానా విధించి ఎంవీఐ యాక్టుతోపాటు, పోలీస్ యాక్టు ప్రకారం శిక్షలు అమలు చేయనున్నారు.

ఇలా ఒకసారి వాహనం నడుపుతూ పట్టుబడితే ఆ వ్యక్తికి 25ఏళ్లు నిండేవరకు లైసెన్సు ఇవ్వకుండా నిషేధం విధిస్తారు. ఇలా కఠిన ఆంక్షలు జూన్ 1 నుంచే అమలులోకి వస్తున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి పోలీస్, రవాణా శాఖలకు ఆదేశాలు జారీ చేసింది.

Tags:    

Similar News