Supreme Court Angers : పార్టీ ఫిరాయింపులు.. అసెంబ్లీ సెక్రటరీపై సుప్రీం ఆగ్రహం

Update: 2025-01-31 11:45 GMT

పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ అంశంపై నిర్ణయం తీసుకోవడానికి మీ దృష్టిలో తగిన సమయం అంటే ఎంత అని అసెంబ్లీ సెక్రటరీని ధర్మాసనం ప్రశ్నించింది. రీజనబుల్ టైమ్ అంటే మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగిసే వరకా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. స్పీకర్‌ను అడిగి నిర్ణయం చెబుతామని న్యాయవాది ముకుల్ రోహత్గీ కోర్టుకు తెలిపారు. దీనిపై తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది.

కాగా, బీఆర్‌ఎస్‌ పార్టీ గుర్తుపై గెలిచిన తెల్లం వెంకట్ రావు , దానం నాగేందర్, కడియం శ్రీహరితో సహా మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ లోకి ఫిరాయించిన సంగతి తెలిసిందే. అయితే.. పార్టీ ఫిరాయింపులపై నాలుగు వారాల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశాలివ్వాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఎస్ఎల్‌పీ దాఖలు చేశారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలకు స్పీకర్‌ ఇప్పటి దాకా కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదని, ఫిరాయింపుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఇటీవలే హరీశ్ రావు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Tags:    

Similar News