కేరళ, వెస్ట్ బెంగాల్ గవర్నర్ కార్యాలయాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. గవర్నర్ల వద్ద పలు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని ఆ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. ఏడాదికి పైగా ఎనిమిది బిల్లులపై గవర్నర్లు ఆమోదం తెలపకుండా ఆపుతున్నారని.. ఎందుకు ఆలస్యమవుతుందో చెప్పడం లేదని పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం కేంద్ర హోంశాఖ, గవర్నర్ కార్యాలయాలకు నోటీసులు జారీ చేసింది.