‘పతంజలి’ వ్యవస్థాపకుడు, యోగా గురువు బాబా రాందేవ్, MD బాలకృష్ణకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. పతంజలి క్షమాపణను ఎట్టకేలకు అంగీకరించిన న్యాయస్థానం కోర్టు ధిక్కరణ కేసును ముగిస్తూ తీర్పు వెలువరించింది. కాగా గతంలో పతంజలి ఉత్పత్తుల గురించి తప్పుడు ప్రకటనలు చేసిందంటూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిల్ వేసింది. దీంతో అసత్య ప్రకటనలు మానుకోవాలని, బహిరంగ క్షమాపణ చెప్పాలని పతంజలిని సుప్రీం కోర్టు అప్పట్లో ఆదేశించింది.
హల్లోపతి వైద్యంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ పతంజలిపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. గతేడాది నవంబర్‌లో ఆ సంస్థను మందలించింది. ఉల్లంఘనలు జరగవని.. పతంజలి తరఫున న్యాయవాది కోర్టుకు హామీ ఇచ్చారు.
కానీ, వాటిని ఉల్లంఘించడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై కోర్టుపై ధిక్కరణ చర్యలు చేపట్టింది. దీంతో, రాందేవ్ బాబా, బాలకృష్ణ పలుమార్లు కోర్టుకు హాజరై క్షమాపణలు చెప్పారు. వాటిని అంగీకరించని అత్యున్నత న్యాయస్థాం.. బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది. ఆతర్వాత కేసుని మూసివేసింది.