Udhayanidhi Stalin : బెదిరింపులకు భయపడేది లే..

అయోధ్య ధర్మకర్త ప్రకటనపై స్పందించిన ఉదయనిది

Update: 2023-09-05 06:15 GMT

తమిళనాడు మాంత్రి, సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. సనాతన ధర్మం డెంగ్యూ, మలేరియా లాంటిదని, దాన్ని నిర్మూలించాలని చెప్పడంపై పలు హిందూ సంఘాలు, బీజేపీ ఫైర్ అవుతున్నాయి. బీజేపీ అగ్రనేతలు కూడా ఆయన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇండియా కూటమిలో డీఎంకే భాగస్వామిగా ఉండటంతో ఇప్పుడు హిందూమతంపై ఇండియా కూటమి వైఖరి చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. 


మరోవైపు ఉత్తర్ ప్రదేశ్ అయోధ్యలోని తపస్వీ చావ్నీ ఆలయ ప్రధాన అర్చకుడు పరమహంస్ ఆచార్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉదయనిధి స్టాలిన్ తలనరికితే రూ. 10 కోట్లు ఇస్తానని ప్రకటించారు. అయితే ఈ వ్యాఖ్యలపై ఉదయనిధి స్పందించారు. రూ.10 కోట్లు ఎందుకు, నా తల దువ్వుకోవడానికి రూ.10 దువ్వెన చాలు అంటూ కౌంటర్ ఇచ్చారు. తమిళంలో చాప్, స్లైస్ అనే పదాలకు జట్టు దువ్వడం అనే అర్థం కూడా ఉంది. సనాతన ధర్మం గురించి మాట్లాడినందుకు యూపీకి సాధువు నా తల షేవ్ చేయడానికి రూ. 10 కోట్లు ప్రకటించారని, నా తల దువ్వు కునేందుకు రూ. 10 దువ్వెన సరిపోతుందని ఉదయనిధి బెదిరింపులను తెలిగ్గా తీసిపారేశారు. తల కోసం ఎవరు వస్తారో చూస్తానన్నారు. అసలు స్వామీజీలకు కోట్ల డబ్బు ఎలా వచ్చిందంటూ ఉదయనిధి ప్రశ్నించారు. 

ఈ బెదిరింపులు మాకు కొత్త కాదని, తమిళం కోసం రైల్వే ట్రాక్ పై తలపెట్టిన కళాకారుడైన కరుణానిధి మనవడిని తాను అన్నారు. కరుణానిధి తమిళనాడు రాష్ట్రానికి ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. సీఎం ఎంకే స్టాలిన్ తండ్రి పెరియార్ ప్రారంభించిన బ్రహ్మణ వ్యతిరేక ద్రావిడ ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఇది ఇలా ఉండగా, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉదయనిధి స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను తృణమూల్ కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది, ప్రతిపక్షాల I.N.D.I.A. కూటమికి ఈ వ్యాఖ్యలతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.“తమిళనాడు ప్రజలను, సీఎం ఎంకె స్టాలిన్‌ను తాను చాలా గౌరవిస్తానని మమతా బెనర్జీ తెలిపారు. ప్రతి మతానికి భిన్నమైన భావాలు ఉంటాయన్నారు. భారతదేశం ‘భిన్నత్వంలో ఏకత్వం’ అని ఒక వర్గానికి హాని కలిగించే ఏ విషయంలోనూ తాము జోక్యం చేసుకోమన్నారు.

Tags:    

Similar News