Swift Car : అరుదైన ఎర్త్ మ్యాగ్నెట్స్ కొరత.. స్విఫ్ట్ కారు ఉత్పత్తి నిలిపివేత
అరుదైన ఎర్త్ మ్యాగ్నెట్స్ ఎగుమతులపై చైనా కఠిన ఆంక్షలు విధించడంతో వీటి కొరత ఏర్పడింది. దీంతో మారుతీ సుజుకీ తన స్విఫ్ట్ కారు ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. మే నెల 26 నుంచే కంపెనీ ఈ కారు ఉత్పత్తిని నిలిపివేసింది. మారుతీ సుజుకీతో పాటు మెర్సిడెస్ బెంజ్ కూడా కొన్ని కార్ల ఉత్పత్తిని తప్పనిసరిగా నిలిపివేయాల్సి వచ్చిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అరుదైన ఎర్త్ మ్యాగ్నెట్స్ కోసం ప్రత్యామ్యాయ మర్గాలను కంపెనీ అణ్వేషి స్తోంది. అరుదైన ఎర్త్ మ్యాగ్నెట్స్ పై చైనా ఆంక్షలు విధించడంతో మన దేశంలో ప్రభావితం
అయిన కంపెనీగా మారుతీ సుజుకీ నిలిచింది.
చైనా తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రపంచ వ్యాప్తంగా కార్ల తయారీ పరిశ్రమ తీవ్రమైన సమస్యలను ఎదుర్కోనున్నాయి. ట్రంప్ సుంకాలతో చైనా వీటి ఎగు మతు లను నియంత్రిస్తోంది. అరుదైన ఎర్త్ మ్యాగ్నెట్స్ ఉత్పత్తి, ఎగుమతుల్లో చైనా 90 శాతం వాటా కలిగి ఉంది. ఎలక్ట్రిక్ కార్లతో పాటు, ఇతర కార్ల తయా రీలోనూ ఈవి చాలా కీలకం. చైనా నుంచి కాకుండా వీటిని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునేందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ఏప్రిల్ 4 నుంచి చైనా ఎర్త్ మ్యాగ్నెట్స్తో పాటు, అరుదైన మినరల్స్ ఎగుమతులపైనా నియంత్రణ విధించింది.