తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చెన్నై లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ఈ ఉదయం మార్నింగ్ వాక్ చేస్తుండగా...ఆయన స్వల్ప అస్వస్థత కు గురయ్యారు. ఈ క్రమంలో ఆయనకు కళ్ళు తిరగడం తో వెంటనే ఆసుపత్రి కి తరలించారు. సీఎం వెంట ఆయన కుమారుడు, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఉదయనిధి ఉన్నారు. మరోవైపు, స్టాలిన్ అస్వస్థతకు గురయ్యారనే వార్తతో పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
కాగా.. అపోలో మెడికల్ బృందం సీఎం స్టాలిన్ ఆరోగ్యం పట్ల స్పందించింది. నీరసం వల్లే ఆయన కళ్ళు తిరిగి పడిపోయాయని ... ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బంది లేదని డాక్టర్లు తెలిపారు. ఆయన లక్షణాలను పరిశీలించి, అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించామని వెల్లడించారు.