భారత్-పాక్ మధ్య జరుగుతున్న యుద్ధంలో తెలుగు జవాన్ మురళీ నాయక్ వీరమరణం చెందాడు. పాక్ కాల్పుల్లో జవాన్ మురళీ నాయక్ మృతి చెందాడు. మురళీ నాయక్ స్వస్థలం సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండా. రేపు కల్లితండాకు మురళీ నాయక్ పార్థివ దేహాన్ని తీసుకురానున్నారు.
మురళీనాయక్ వీరమరణం, త్యాగాన్ని మరువలేమని పలువురు స్పందించారు. వీర జవాన్ మురళీ నాయక్ మరణవార్త విని గుండెలవిసేలా కుటుంబసభ్యులు రోదిస్తున్నారు. మురళీ నాయక్ ఇంటి వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి.