Amritsar : అమృత్ సర్ లో ఉగ్రవాద కుట్ర భగ్నం

Update: 2025-05-02 08:00 GMT

అమృత్‌సర్‌లో ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేశాయి బిఎస్‌ఎఫ్ దళాలు. పహల్గాం టెర్రర్ అటాక్ తర్వాత భద్రతా బలగాలు డేగ కన్నుతో పర్యవేక్షిస్తున్నాయి. అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాయి. ఈ క్రమంలో అమృత్‌సర్ జిల్లాలోని భరోపాల్ గ్రామం సమీపంలో పంజాబ్ పోలీసులతో కలిసి బిఎస్‌ఎఫ్ దళాలు భారీ ఆయుధాలు, మందుగుండు సామగ్రి, గ్రెనేడ్‌లను స్వాధీనం చేసుకున్నాయి. సంయుక్తంగా నిర్వహించిన సెర్చ్ ఆపరేషన్‌లో 2 గ్రెనేడ్‌లు, 3 పిస్టళ్లు, 6 మ్యాగజైన్‌లు, 50 లైవ్ కార్ట్రిడ్జ్‌లు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, మందుగుండు సామగ్రిని పోలీసులకు అప్పగించారు.

Tags:    

Similar News