దాక్టర్ల రూపంలో టెర్రరిజం.. ఇంటెలిజెన్స్ ఏం చేస్తోంది..?

Update: 2025-11-13 09:41 GMT

ఢిల్లీ పేలుడు దేశాన్ని కుదిపేసింది. దేశ నడిబొడ్డున ఉగ్రవాద చర్య అంటే ఎంత దారుణం. పైగా చేసింది బయట నుంచి వచ్చిన వాళ్లు కూడా కాదు. చదువు రాని వారు కూడా కాదు. మన దేశంలోనే ఉంటూ.. అత్యంత విలువైన డాక్టర్ వృత్తి చేస్తున్న వారే. జమ్మూ కాశ్మీర్, ఫరీదాబాద్, గుజరాత్, హైదరాబాద్ లో ఉండే డాక్టర్లు ఇంత దారుణాలకు పాల్పడ్డారంటే వీళ్లను ఏం అనాలి. చదువుకున్న వాళ్లకు ఇదేం పోయేకాలం. మన మధ్యనే డాక్టర్లుగా ఉంటూ.. ఉగ్రవాదులకు అనుకూలంగా పనిచేస్తున్న వీళ్లు.. టెర్రరిస్టులుగా మారి సామాన్య జనాల ప్రాణాలు తీస్తున్నారు. చదువుకున్న వాళ్లకు ఏది మంచి, ఏది చెడు అనేది తెలియదా. ఆ మాత్రం బుద్ధి, జ్ఞానం వీళ్లకు లేదా.

ఉగ్రవాదులు ఏం చెబితే అది చేసేస్తారా. అంటే భారతదేశాన్ని ఏం చేయాలి అనుకుంటున్నారు. ఈ దేశంలో పుట్టి, ఇక్కడే పెరిగి పాకిస్థాన్ టెర్రరిస్టులకు అనుకూలంగా పనిచేస్తారా.. చదువకున్న వాళ్లు ప్రజల ప్రాణాలను కాపాడే డాక్టర్ల వృత్తిలో ఉంటూ.. చివరకు అదే ప్రజల ప్రాణాలను ఎలా తీస్తారు. వీళ్లకు ఇంత పెద్ద ఎత్తున పేలుడు సామాగ్రి ఎక్కడి నుంచి వచ్చింది. ఇంత చేస్తుంటే మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తోంది. నలుగురు డాక్టర్లను పట్టుకున్నారు ఓకే. కానీ ఇలాంటి వారు ఇంకెంత మంది ఉన్నారు.

ఒక డాక్టర్ వల్లే ఇంత మంది ప్రాణాలు కోల్పోయారు. కేవలం పేలుడు పదార్థాలే కాకుండా విషం కంటే డేంజర్ గా ఉండే వాటిని ఇప్పటికే వాళ్లు రెడీ చేస్తున్నారు. ఎక్కడ కలిపినా సరే వందలాది మంది చనిపోవడం ఖాయం. మరి ఇంత మంది చనిపోతే అప్పుడు మన ఇంటెలిజెన్స్ నిద్ర లేస్తుందా. మన దేశంలో ఇంత పెద్ద కుట్రలు జరుగుతుంటే ఇంటెలిజెన్స్ ఎందుకు పసిగట్టలేకపోతోంది. ఈ పేలుడు సామాగ్రి బార్డర్లు దాటి ఇండియాలోకి ఎలా వస్తోంది. అంత పెద్ద ఎత్తున వస్తుంటే పోలీసులు ఎందుకు పట్టుకోలేకపోతున్నారు. దీనిపై దేశమంతా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మన మధ్య ఉండే అనుమానితులను కచ్చితంగా పట్టుకోవాల్సిన బాధ్యత ఇంటెలిజెన్స్ తో పాటు మన మీద కూడా ఉంది.


Full View

Tags:    

Similar News