జమ్ముకశ్మీర్‌లోని దోడా జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య సోమవారం రాత్రి ఎదురుకాల్పులు జరిగాయి. దెస్సా ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ఓ అధికారి సహా నలుగురు ఆర్మీ జవాన్లు అమరులయ్యారు. ఆ రాష్ట్రానికి చెందిన పోలీసులు సైతం గాయపడ్డారు. దోడా జిల్లాలోని దెస్సా ఫారెస్ట్ ఏరియాలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భారత ఆర్మీ, స్థానిక పోలీసులతో కలిసి సోమవారం రాత్రి 7.45 గంటలకు ఆపరేషన్ చేపట్టింది. రాత్రి 9 గంటల టైమ్ లో ఉగ్రవాదాలు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. 20 నిమిషాల పాటు జరిగిన ఈ కాల్పుల్లో ఆర్మీ సిబ్బంది, పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో ఆర్మీ అధికారి, నలుగురు జవాన్లు మరణించినట్లు అధికారులు తెలిపారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందన్నారు. మరోవైపు ఈ దాడికి పాల్పడినది తామేనంటూ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ కు చెందిన కశ్మీర్ టైగర్ ప్రకటించింది.