పార్లమెంట్ శీతాకాల సమావేశా ల్లో వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. అదానీ అవినీతి వ్యవహారం, పలు అంశాలపై చర్చ చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేస్తు న్నాయి. ఇవాళ ఉదయం 11 గంటలకు ఉభయసభలు ప్రారంభంకాగానే అదానీ అంశంపై చర్చించాలని లోక్ సభ కాంగ్రెస్ ఎంపీ మణికం ఠాగూర్, తమిళనాడులో పలు జిల్లాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా సం భవించిన ఆస్తి, పంట నష్టంపై చర్చించాలని డీఎంకే ఎంపీ టీఆర్ బాలు వాయిదా తీర్మానం ఇచ్చారు. మరోవైపు బంగ్లాదేశ్లో హిందువుల పై జరిగిన అకృత్యాలు, చిన్మయ్ కృష్ణదాస్తో సహా ముగ్గురు ఇస్కాన్ పూజారుల అరెస్టుపై చర్చించాలని రాజ్యసభలో ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా, సంభల్ హింసాకాండ, అజ్మీర్ షరీఫ్ దర్గా వ్యవహారంపై కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్ గర్హి, మణిపూర్ లో పరిస్థితిపై చర్చిం చేందుకు డీఎంకే ఎంపీ టీ శివ, పంజాబ్లో వరి సేకరణ అంశంపై కాంగ్రెస్ ఎంపీ డాక్టర్ అమర్ సింగ్, ఢిల్లీలో శాంతిభద్రతలపై మరో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ వాయిదా తీర్మానం ఇచ్చారు. వీటిని రూల్ 267 కింద చర్చించాలని కోరారు. అయితే విపక్ష సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాలను లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ కర్ తిరస్కరించారు. విపక్షాల ఆందో ళనతో రాజ్యసభ లోక్ సభ కూడా రేపటికి వాయిదా పడింది