LABOUR CODES: ‘కేంద్రం లేబర్‌ కోడ్స్‌ మాకొద్దు’

అమల్లోకి వచ్చిన కొత్త లేబర్‌ కోడ్స్‌... నిబంధనలను నోటిఫై చేసిన కేరళ .. అభ్యంతరాలు పట్టించుకోని కేంద్రం

Update: 2025-11-28 14:52 GMT

కేం­ద్ర ప్ర­భు­త్వం ఇటీ­వల నో­టి­ఫై చే­సిన లే­బ­ర్ కో­డ్స్‌­ను తమ రా­ష్ట్రం­లో అమలు చే­య­బో­మ­ని కేరళ స్ప­ష్టం చే­సిం­ది. కేం­ద్ర ప్ర­భు­త్వం 2020 నుం­చి పెం­డిం­గ్‌­లో ఉన్న మొ­త్తం నా­లు­గు లే­బ­ర్ కో­డ్స్‌­ను ఇటీ­వల నో­టి­ఫై చే­సిం­ది. దశా­బ్దా­లు­గా ఉన్న 29 కా­ర్మిక చట్టాల స్థా­నం­లో ఈ కొ­త్త ఫ్రే­మ్‌­వ­ర్క్‌­ను తీ­సు­కొ­చ్చా­రు. కేరళ కా­ర్మిక శాఖ మం­త్రి వి.శి­వ­న్ కు­ట్టి కేం­ద్ర కా­ర్మిక కో­డ్స్‌­ను తమ రా­ష్ట్రం­లో అమలు చే­య­బో­మ­ని స్ప­ష్టం చే­శా­రు. కేరళ ఇప్ప­టి­కే ఈ వి­ష­యా­న్ని కేం­ద్ర కా­ర్మిక మం­త్రి­త్వ శా­ఖ­కు తె­లి­య­జే­సిం­ది. రా­ష్ట్ర ప్ర­భు­త్వా­న్ని నడు­పు­తు­న్న సీ­పీఐ(ఎం) ఈ కో­డ్స్‌­ను తీ­వ్రం­గా వ్య­తి­రే­కి­స్తోం­ది. ఈ కో­డ్స్‌ కా­ర్మి­కుల దీ­ర్ఘ­కా­లిక హక్కు­లు, రక్ష­ణ­ల­ను పలు­చన చే­సే­లా ఉన్నా­య­ని ఆ పా­ర్టీ ఆరో­పి­స్తోం­ది. ఈ కో­డ్స్‌ కం­పె­నీల యజ­మా­ను­ల­కు అను­కూ­లం­గా ఉం­డే­లా రూ­పొం­దిం­చి­న­ట్లు చె­బు­తోం­ది.ఈ కో­డ్‌­లు ఉపా­ధి­ని పెం­చు­తా­య­నే కేం­ద్ర ప్ర­భు­త్వ వా­ద­న­ను కేరళ ప్ర­భు­త్వం తి­ర­స్క­రిం­చిం­ది. ఈ కో­డ్స్‌ లక్ష్యం కా­ర్మిక హక్కు­ల­ను రద్దు చే­య­డం ద్వా­రా జా­తీయ, అం­త­ర్జా­తీయ పె­ట్టు­బ­డు­ల­ను ఆక­ర్షిం­చ­డం అని పే­ర్కొం­ది. ఈ కో­డ్స్‌ కా­ర్మి­కు­లు సమ్మె చేసే హక్కు­ను హరిం­చ­డా­ని­కి ప్ర­య­త్ని­స్తు­న్నా­య­ని అభ్యం­త­రం వ్య­క్తం చే­సిం­ది. ఈ సం­ద­ర్భం­గా మం­త్రి శి­వ­న్ కు­ట్టి మా­ట్లా­డు­తూ.. రా­ష్ట్ర ప్ర­భు­త్వం కా­ర్మిక వ్య­తి­రేక వై­ఖ­రి­ని తీ­సు­కో­ద­ని తె­లి­పా­రు. కేం­ద్ర కా­ర్మిక సం­ఘాల ప్ర­తి­ని­ధు­ల­తో సమా­వే­శం జరు­పు­తు­న్న­ట్లు చె­ప్పా­రు. డి­సెం­బ­ర్ మూడో వా­రం­లో తి­రు­వ­నం­త­పు­రం­లో కా­ర్మిక సద­స్సు ఏర్పా­టు చే­స్తు­న్న­ట్లు పే­ర్కొ­న్నా­రు. కేం­ద్ర ప్ర­భు­త్వం ఇతర రా­ష్ట్రా­ల­తో ఎలాం­టి సం­ప్ర­దిం­పు­లు లే­కుం­డా­నే ఏక­ప­క్షం­గా ని­ర్ణ­యం తీ­సు­కుం­ద­ని చె­ప్పా­రు.

తొలిసారిగా గిగ్ కార్మికులకు సామాజిక భద్రత కల్పించడం.

దేశవ్యాప్తంగా కార్మికులందరికీ కనీస వేతనాలు అమలు.

ఉద్యోగులందరికీ తప్పనిసరి నియామక పత్రాలు.

అన్ని రంగాల్లో ఏకరీతి వేతన చెల్లింపు నియమాలు తీసుకురావడం.

లే­బ­ర్ కో­డ్స్‌­పై ని­పు­ణు­లు కొ­న్ని అభ్యం­త­రా­ల­ను వ్య­క్తం చే­స్తు­న్నా­రు. ము­ఖ్యం­గా కా­ర్మిక సం­ఘా­లు, కొ­న్ని రా­ష్ట్రాల నుం­చి వచ్చిన అం­శా­లు కిం­ది వి­ధం­గా ఉన్నా­యి. మొ­ద­టి­ది తొ­ల­గిం­పు ని­య­మా­లు సడ­లిం­పు. 300 మంది వరకు కా­ర్మి­కు­లు ఉన్న సం­స్థ­ల­కు ప్ర­భు­త్వం నుం­చి ముం­ద­స్తు అను­మ­తి లే­కుం­డా­నే లే-ఆఫ్‌­లు లేదా తొ­ల­గిం­పు చర్య­లు తీ­సు­కో­వ­డా­ని­కి అను­మ­తి­స్తుం­ది. గతం­లో ఈ పరి­మి­తి 100 మంది కా­ర్మి­కు­లు­గా ఉం­డే­ది. దీ­ని­వ­ల్ల సం­స్థ­లు ఇష్టా­ను­సా­రం ఉద్యో­గు­ల­ను తొ­ల­గిం­చే అవ­కా­శం ఉంది. రెం­డ­వ­ది సమ్మె హక్కు­పై పరి­మి­తు­లు. సమ్మె­కు వె­ళ్లే ముం­దు 14 రో­జుల నో­టీ­సు తప్ప­ని­స­రి. ఈ ని­య­మా­లు సమ్మె హక్కు­ను పరి­మి­తం చే­స్తా­య­ని కా­ర్మిక సం­ఘాల సా­మూ­హిక బే­ర­సా­రాల శక్తి­ని బల­హీ­న­ప­రు­స్తా­య­ని ఆం­దో­ళన వ్య­క్తం అవు­తోం­ది. మూ­డ­వ­ది సా­మా­జిక భద్ర­త­పై అస్ప­ష్టత. గిగ్ కా­ర్మి­కు­ల­కు సా­మా­జిక భద్రత కల్పి­స్తు­న్న­ప్ప­టి­కీ ఈ ని­ధు­ల్లో కం­పె­నీల వి­రా­ళం చాలా తక్కువ (ఆదా­యం­లో 1-2%) ఉంది. ఇది వారి అవ­స­రా­ల­కు సరి­పో­ద­ని కా­ర్మిక సం­ఘా­లు భా­వి­స్తు­న్నా­యి. నా­లు­గ­వ­ది పని గం­ట­లు. ఈ కోడ్ పని గం­ట­ల­ను రో­జు­కు 8 నుం­చి 12 గం­ట­ల­కు పెం­చ­డా­ని­కి అను­మ­తి­స్తుం­ది (వా­రా­ని­కి మొ­త్తం పని గం­ట­ల్లో మా­ర్పు లే­క­పో­యి­నా). ఇది కా­ర్మి­కుల ఆరో­గ్యం, శ్రే­య­స్సు­కు హా­ని­క­రం. ఇంకో కీలక అంశం  స్థిర కాల ఉపా­ధి.  ఉద్యో­గు­ల­ను ఏ రక­మైన పని­కై­నా ని­ర్ది­ష్ట కా­లా­ని­కి ని­య­మిం­చ­డా­ని­కి ఈ కో­డ్‌­లు అను­మ­తి­స్తా­యి. దీ­ని­వ­ల్ల సం­స్థ­లు రె­గ్యు­ల­ర్ ఉద్యో­గు­ల­కు ఇవ్వా­ల్సిన ప్ర­యో­జ­నా­లు (గ్రా­ట్యు­టీ, పె­న్ష­న్ వం­టి­వి) ఎగ­వే­సి, ఎక్కువ మంది కా­ర్మి­కు­ల­ను తా­త్కా­లి­కం­గా ని­య­మిం­చు­కు­నే అవ­కా­శం ఉంది. ఈ కో­డ్స్‌ లక్ష్యం కా­ర్మిక హక్కు­ల­ను రద్దు చే­య­డం ద్వా­రా జా­తీయ, అం­త­ర్జా­తీయ పె­ట్టు­బ­డు­ల­ను ఆక­ర్షిం­చ­డం అని పే­ర్కొం­ది. 

Tags:    

Similar News