Kishan Reddy: సైన్యానికి దేశం అండగా ఉండాలి.. కిషన్ రెడ్డి పిలుపు

Update: 2025-05-10 11:45 GMT

భారత సైనికులకు దేశ ప్రజలు మద్దతుగా నిలవాలన్నారు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి. సరిహద్దుల వెంట కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో హైదరాబాద్‌, బషీర్‌బాగ్‌లోని కనకదుర్గ ఆలయంలో కిషన్‌ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. పాకిస్థాన్‌ పై యుద్ధం చేస్తున్న భారత సైనికులకు తగిన శక్తి సామర్థ్యాలు ప్రసాదించాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. దేశ ప్రజలు సైతం సైనికుల రక్షణకు ఇదే విధంగా తమ ఇష్ట దైవాలను ప్రార్థించాలని కోరారు.

Tags:    

Similar News