ఉత్తర ప్రదేశ్ కాన్పూర్‌లో ఫ్లై ఓవర్ కుప్పకూలింది. కాన్పూర్‌ను ఉన్నావ్‌ను కలిపే గంగా ఫ్లై ఓవర్ ఉదయం కూలిపోయింది. సుమారు 125 ఏళ్ల క్రితం బ్రిటిష్ వారు నిర్మించిన ఈ ఫ్లైఓవర్ ఇప్పటికే పాడైపోయింది. దీంతో వాహనాలు అనుమతించకుండా ఈ ఫ్లైఓవర్ ను చాలా రోజుల కిందటే మూసివేశారు అధికారులు. ఫ్లై ఓవర్ ను కూల్చేసేందుకు యూపీ ప్రభుత్వం కూడా అంగీకరించింది. అయితే ప్రభుత్వం కూల్చేలోపే ఫ్లై ఓవర్ ఉదయం కుప్పకూలిపోయింది.