CPI Narayana : న్యాయవ్యవస్థ దిగజారి పోయింది : నారాయణ

Update: 2025-03-26 09:30 GMT

న్యాయవ్యవస్థలో ఉన్నత స్థానం లో ఉన్నవారే అవినీతికి పాల్పడుతున్నారని, ప్రసుత్తం న్యాయవ్యవస్థ దిగజారిపోతుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు.. జస్టిస్ వర్మ అవినీతికి పాల్పడ్డారని అనడానికి బయట పడ్డ నోట్ల కట్టలే నిదర్శనమన్నారు. బీజేపీకి అనుకూలంగా వ్యవహరించే జడ్జీలు ఉన్నత పదవులను వెళ్తున్నారని చెప్పారు. ' జడ్జీల పై బిజెపి ఒత్తిడి పెరుగుతుంది. జస్టిస్ వర్మను హైకోర్టు ఎంట్రన్స్ ముందు సోఫాలో కూర్చోబెట్టి పని ఇవ్వకుండా పనిష్మెంట్ ఇవ్వాలి. పార్లమెంట్ లో 90 మందిపై రేప్ కేసులు ఉండగా, కేంద్ర కేబినెట్ లో 38 మందిపై కూడా కేసులు నమోదయ్యాయి. ఎన్ని కలసంఘాన్ని బీజేపీ చంపేసింది. డీలిమిటేషన్ విషయంలో సౌత్ ఇండియా నార్త్ ఇండియా ఫీలింగ్ సరికాదు. ఫెడరల్ స్ఫూర్తిని ఆమలు చేసేలా కేంద్రం వ్యవహరించాలి. జమిలి ఎన్ని కలు ఎలా సాధ్యమవుతాయి. బీజేపీ, మోదీ వ్యక్తి గత ఎజెండాను దేశవ్యాప్తంగా అమలు చేయాలని చూస్తున్నారు. పాన్పరాగ్, గుట్కా ప్రకటనలలో అమితా బచ్చన్, షారుక్ ఖాన్ యాక్ట్ చేస్తున్నారు. వందల, వేలకోట్లు ఆస్తులు ఉన్న వారు ఎందుకు ప్రకటనల ప్రమోషన్లు చే స్తున్నారు' అని నారాయణ ప్రశ్నించారు.

Tags:    

Similar News