Lok Sabha : వక్ఫ్ ఆస్తులు ఆ రాష్ట్రంలోనే అత్యధికం

Update: 2025-04-02 13:45 GMT

కేంద్రమంత్రి కిరణ్ రిజిజు లోక్‌సభలో వక్ఫ్ బిల్లును ప్రవేశపెట్టారు. అందులో ప్రతిపాదించిన సంస్కరణలపై ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొడుతున్నారు. చట్టంలో సానుకూల మార్పులను తీసుకొస్తుంటే ఎందుకు విమర్శిస్తున్నారని ప్రశ్నించారు. అబద్ధాలతో సభను తప్పుదోవ పట్టించొద్దన్నారు. యూపీఏ హయాంలోనూ ఈ చట్టంలో సవరణలు జరిగాయన్నారు. అది మిగతా చట్టాలపై ప్రభావం చూపిందని, అందుకే మళ్లీ సవరించాల్సి వస్తోందన్నారు.

దేశంలో వక్ఫ్ ఆస్తులు అత్యధికంగా ఉత్తర్ ప్రదేశ్‌లో ఉన్నాయి . 27 శాతం ఆస్తులు ఆ రాష్ట్రంలోనే ఉన్నాయంది. ఆ తర్వాతి స్థానాల్లో వెస్ట్ బెంగాల్(9%), పంజాబ్(9%), తమిళనాడు(8%), కర్ణాటక(7%), కేరళ(6%), తెలంగాణ(5%), గుజరాత్(5%) ఉన్నాయని వెల్లడించింది. ఇవాళ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు లోక్‌సభలో ప్రవేశపెట్టిన వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై చర్చ జరుగుతోంది.

Tags:    

Similar News