MODI: దేశాన్ని దోచుకునేందుకే "ఇండియా"

మరోసారి ప్రతిపక్ష ఇండియా కూటమిపై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు... దేశాన్ని దోచుకునేందుకు పేరు మార్చుకున్నారని ఎద్దేవా...

Update: 2023-07-27 08:30 GMT

ప్రతిపక్ష ఫ్రంట్‌కు ఇండియా అని పేరు పెట్టుకుంది దేశభక్తిని చాటేందుకు కాదని, దోచుకునేందుకు అని ప్రధాని నరేంద్రమోదీ‍( Prime Minister) విమర్శించారు. ప్రతిపక్ష ఫ్రంట్‌పై మరోసారి ప్రధాని తీవ్ర విమర్శలు చేశారు. రాజస్థాన్‌లోని సికార్‌(Rajasthan's Sikar )లో బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన మోదీ... విపక్షాలపై మండిపడ్డారు. గత తప్పిదాలను దాచిపెట్టేందుకు ప్రతిపక్షాలు(Opposition) తమ కూటమి పేరును UPA నుంచి INDIAగా మార్చుకున్నాయని ఆరోపించారు.

విపక్ష కూటమి( Opposition's new coalition) పేదలకు వ్యతిరేకంగా ఎలా కుట్రలు పన్నిందో దేశమంతా తెలుసన్న ప్రధాని ) Prime Minister Narendra Modi ) అన్నారు. ఉగ్రవాదం ముందు లొంగిపోయిన మరకను తొలగించుకునేందుకు కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు తమ కూటమి పేరు( INDIA) మార్చుకున్నాయని అన్నారు. విపక్షాల మార్గాలు దేశ శత్రువుల మాదిరిగానే ఉన్నాయని ఆరోపించారు. ఇండియా పేరు వారి దేశభక్తిని చూపించడానికి కాదని, దేశాన్ని దోచుకోవాలనే ఉద్దేశ్యంతోనే అని మోదీ అన్నారు.


యువత అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్న( central government is working for the development of youth) మోదీ...కానీ రాజస్థాన్‌లో ఏం జరుగుతోందని ప్రశ్నించారు. రాజస్థాన్‌ ప్రభుత్వం యువత భవిష్యత్తుతో ఆడుకుంటోందని విమర్శించారు. రాజస్థాన్‌లో పేపర్ లీక్ నిత్యకృత్యమైందని విమర్శించారు. రాజస్థాన్‌లో యువత సమర్ధులైనా ఇక్కడి ప్రభుత్వం వారి భవిష్యత్తును నాశనం చేస్తోందని మండిపడ్డారు.

రాజస్థాన్‌లోని సీకర్‌ పట్టణంలో ప్రధాని మోదీ పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. 1.25లక్షల పీఎం కిసాన్‌ సమృద్ధి కేంద్రాన్ని ఆయన జాతికి అంకితం చేశారు.

ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాజస్థాన్‌లో ప్రధాని మోదీ పర్యటించడం గత ఆరు నెలల్లో ఇది ఏడోసారి కావడం గమనార్హం. ఇటీవల మణిపుర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై ప్రధాని మోదీ స్పందిస్తూ రాజస్థాన్‌ ప్రస్తావన తీసుకురావడం తీవ్ర దుమారం రేపింది. దీనిపై గహ్లోత్‌ తీవ్రంగా స్పందించారు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రధాని కార్యక్రమంలో ఆయన ప్రసంగాన్ని తొలగించడం చర్చనీయాంశంగా మారింది. ప్రధాని కార్యాలయం రాజస్థాన్‌ ముఖ్యమంత్రి ప్రసంగాన్ని తొలగించడం వివాదాన్ని రేపింది. 

Tags:    

Similar News