Kumbh Mela: వసంత పంచమి అమృత స్నానాలుప్రారంభం

భక్తజనసంద్రంగా మారిన ప్రయాగ్‌రాజ్‌..;

Update: 2025-02-03 02:30 GMT

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా లో నేడు వసంత పంచమి సందర్భంగా అమృతస్నానాలకు భక్తులు క్యూ కట్టారు. సోమవారం తెల్లవారుజాము నుంచే త్రివేణీసంగమంలో పెద్ద ఎత్తున భక్తులు పుణ్యస్నానాలు చేస్తున్నారు. వసంత పంచమి  ని పురస్కరించుకొని సోమవారం 4 కోట్ల నుంచి 6 కోట్లమంది జనం రానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

మౌనీ అమావాస్య రోజున చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన నేపథ్యంలో కుంభమేళా ప్రాంతంలో భద్రతను మరింత పటిష్టం చేశారు. బారికేడ్లు ఏర్పాటుచేయడంతోపాటు ఘాట్ల వద్ద సింగల్‌ లైన్‌లో పంపిస్తున్నారు. అదేవిధంగా ప్రయాగ్‌రాజ్‌ లోపలికి కార్లను అనుమతించడం లేదు. బయటి రాష్ట్రాలనుంచి వచ్చే భక్తుల కోసం 84 పార్కింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 54 అతి జనసాంద్రత నియంత్రణ కేంద్రాలను ఏర్పాటు చేశారు.అటు యూపీ  ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌  తెల్లవారుజామున 3.30 గంటల నుంచే పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. డీజీపీ, హోంశాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీకి అవసరమైన సూచనలు చేస్తున్నారు. ఆయన అధికార నివాసంలో ప్రత్యేకంగా ఒక వార్‌రూమ్‌ ఏర్పాటు చేశారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఉదయం 6 గంటల్లోపే కొంతమంది అఖాడాలు అమృతస్నానాలు ఆచరించారు. నాగసాధువులు కూడా రానున్నారు. గంగా, యమున, సరస్వతి నదుల పవిత్ర సంగమమైన త్రివేణి సంగమంలో నిరంజని అఖాడా అధిపతి కైలాశానంద గిరి మహరాజ్‌, అఖాడాలకు చెందిన ఇతర సాధవులు తమకు కేటాయించిన ఘాట్‌లలో పవిత్ర స్నానాలు చేశారు. వీరితోపాటు విదేశీయులు, సాధారణ భక్తులు లక్షల సంఖ్యల సంఖ్యలో తరలివస్తుండటంతో ప్రయాగ్‌రాజ్‌ మరోసారి భక్తజనసంద్రమైంది. హరహర మహాదేవ్‌ నినాదాలతో ఘాట్‌లు మార్మోగుతున్నాయి.

త్రివేణీ సంగమం వద్ద భక్తులపై హెలికాప్టర్లతో పూలవర్షం కురిపించారు. తెల్లవారుజామున 4 గంటల వరకు 16.58 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. జనవరి 13న కుంభమేళా ప్రారంభం కాగా.. ఇప్పటివరకు  మంది పుణ్యస్నానాలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. 144ఏళ్లకోసారి వచ్చే ఈ మహా కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది.

Tags:    

Similar News