Rains: వచ్చే ఐదు రోజుల్లో ఆ 18 రాష్ట్రాల్లో భారీ వర్షాలు..
Rains: నైరుతి రుతుపవనాలు మే నెలాఖరులోనే కేరళను తాకినా నెమ్మదిగా కదులుతున్నాయి.;
Rains: నైరుతి రుతుపవనాలు మే నెలాఖరులోనే కేరళను తాకినా నెమ్మదిగా కదులుతున్నాయి. సాధారణం కంటే రెండు రోజులు ఆలస్యంగా మహారాష్ట్రలోకి ప్రవేశించాయి. దీని ప్రభావంతో ముంబై సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. కొంకణ్‌లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. మరికొన్ని రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే 48 గంటలూ రుతుపవనాల ప్రభావం మహారాష్ట్రలో తీవ్రంగా ఉంటుందని తెలిపింది.
దీంతో ముంబై తీరంలో అలలు ఎగసిపడుతున్నాయి. అరుణాచల్‌ప్రదేశ్, అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, పశ్చిమ బెంగాల్‌లోనూ వచ్చే ఐదు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. బీహార్, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లలో చెదురుమదురు వర్షాలు కురుస్తాయని తెలిపింది. కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, లక్షద్వీప్, పుదుచ్చేరిలోనూ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వివరించింది. అయితే.. రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, యూపీల్లో మరో 3 రోజులు ఎండలు మండిపోనున్నాయి.