Pahalgam Attack : ఇలాంటి దాడి దేశంలోనే తొలిసారి!

Update: 2025-04-23 07:30 GMT

టెర్రరిజానికి మతం లేదంటారు. కానీ ఇప్పుడు ఉగ్రవాద మూర్ఖత్వానికి మతం ప్రామాణికమైంది. జమ్మూకశ్మీర్ పహల్‌గామ్‌లో మతాన్ని తెలుసుకుని మరీ దాడి చేయడం దేశంలోనే తొలిసారి అని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రశాంతంగా ఉన్న జమ్మూకశ్మీర్‌లో మత చిచ్చు రేపి, దాన్ని భారత్ అంతా విస్తరించడమే ఈ దాడి ఉద్దేశమని అంచనా వేస్తున్నారు. పాక్ ప్రేరేపిత లష్కర్ ఏ తొయిబా ఆదేశాలతోనే ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ ఘాతుకానికి పాల్పడిందంటున్నారు.

ఉగ్రదాడికి నిరసనగా ఇవాళ జమ్మూకశ్మీర్‌లో బంద్‌కు JKHC, CCIK, ట్రావెల్, ట్రేడ్ సంఘాలు పిలుపునిచ్చాయి. దీనికి అధికార నేషనల్ కాన్ఫరెన్స్‌తో పాటు పీడీపీ, ఇతర పార్టీలు కూడా మద్దతిచ్చాయి. మృతులకు నివాళిగా పలు ప్రాంతాల్లో క్యాండిల్‌లైట్లతో నిరసన తెలపనున్నాయి. ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరాయి.  

Tags:    

Similar News