పార్లమెంట్ భవనంలోకి ముగ్గురు దుండగులు అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించడంతో కలకలం రేగింది. గేట్ నంబర్ 3 నుంచి ఖాసీం, మోసిన్, షోయబ్ నకిలీ ఆధార్ కార్డులతో పార్లమెంట్ లోపలికి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. గత డిసెంబర్‌లో సైతం దుండగులు పార్లమెంట్‌లోకి ప్రవేశించి పొగగొట్టాలతో సభ్యులను భయభ్రాంతులకు గురి చేయడం సంచలనం రేపింది.
కాగా గతంలో అంటే 2023 డిసెంబర్ 13 న ఇద్దరు యువకులు ప్రేక్షకుల గ్యాలరీ నుండి ప్రజాప్రతినిధులు ఉన్న గ్యాలరీలోకి దూకి, కలర్ స్మోక్‌ను విడుదల చేశారు. . ఈ సమయంలో హాలు మొత్తం పొగతో నిండిపోయింది.అప్పటి నుంచి పార్లమెంట్ భద్రతను పెంచారు. నిందితులను భద్రతా దళాలు పట్టుకున్నాయి. వారితో పాటు, ఇతర సహచరులను కూడా అరెస్టు చేశారు. అలా ఈ కేసులో ఇప్పటి వరకు 6 మందిని అరెస్టు చేశారు. ఈ ఘటనతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు భద్రతను మార్చింది.