తమిళనాడులోని అరక్కోణంలో పెను ప్రమాదం తప్పింది. రైల్వే పట్టాలపై దుండగులు బోల్టులు తప్పించారు. అధికారుల అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బెంగళూరు, కేరళ వెళ్లే రైళ్లను దారి మళ్లించారు. ఘటనపై రైల్వే అధికారులు విచారణ చేపట్టారు. సీసీ ఫుటేజీలు పరిశీలిస్తున్నారు. ఈ ఘటన కారణంగా బెంగళూరు, కేరళ వైపు వెళ్తున్న పలు రైళ్లను వేరే మార్గాల ద్వారా పంపించారు. దీంతో ప్రయాణికులకు స్వల్ప అసౌకర్యం ఎదురైంది. కొన్ని రైళ్లు ఆలస్యంగా నడవగా, మరికొన్నింటిని రద్దు చేయాల్సి వచ్చింది.