జమ్మూకశ్మీర్ లోని పహల్గాంలో ఇటీవల మారణహోమం సృష్టించిన టీఆర్ఎఫ్ ను ఉగ్ర సంస్థగా ప్రకటించాలని భారత్ డిమాండ్ చేసింది. ఈ మేరకు భారత ప్రతినిధుల బృందం ఐక్యరాజ్యసమితి ఉన్నతాధి కారులను కలిసింది. ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడి గురించి వివరించింది. 26 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న ఈ ఉగ్రదాడికి తాము భాద్యులమని లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెంట్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) ప్రకటించిన విషయాన్ని యూఎస్ అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. టీఆర్ ఎఫ్ పాత్రపై తమ వద్ద ఉన్న సమాచారాన్ని వారికి వెల్లడించింది. చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా చర్చించారు. 2022 ఢిల్లీ డిక్లరేషన్లో ఆమోదించిన ఉగ్రవాద కార్యకలాపాల కోసం సాంకేతిక పరిజ్ఞానం దుర్వినియోగం కాకుండా ఎదుర్కొనే తీర్మానంపై భారత ప్రతినిధి బృందం యూఎన్ అధికారులతో చర్చించింది.