Donald Trump: బియ్యం దిగుమ‌తుల‌పై భార‌త్‌కు వార్నింగ్ ఇచ్చిన ట్రంప్‌

స్వ‌దేశీ రైతుల‌కు 12 బిలియ‌న్ల డాల‌ర్ల ప్యాకేజీ

Update: 2025-12-09 02:45 GMT

భారతదేశం-అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతోంది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ప్రపంచ వాణిజ్య యుద్ధానికి తెరలేపారు. అయితే మిగతా దేశాలకు ఒకలాగా.. భారతదేశంపై మరొకలాగా సుంకాలు విధించారు. భారత్‌పై ఏకంగా 50 శాతం సుంకం విధించారు. దీంతో రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తలు చోటుచేసుకున్నాయి. అనంతరం రెండు దేశాల మధ్య వాణిజ్య చర్చలు నడిచినా ఫలించలేదు. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు అంతమాత్రంగానే ఉన్నాయి.

తాజాగా ట్రంప్ మరో హెచ్చరిక చేశారు. భారత్ నుంచి అమెరికాలోకి బియ్యం డంప్‌ను నిలిపివేయాలని సూచించారు. లేదంటే కొత్త సుంకం విధించాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. బియ్యం దిగుమతులపై సుదీర్ఘ చర్చ తర్వాత ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.

భారతదేశం నుంచి అమెరికాకు ఎక్కువగా బియ్యం దిగుమతులు అవుతుంటాయి. ఇక కెనడా నుంచి ఎరువులు వస్తుంటాయి. అయితే భారత్ నుంచి బియ్యం దిగుమతులు ఎక్కువగా వస్తున్నాయని.. దీంతో అమెరికన్ రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని అధికారులు వెల్లడించారు. విదేశీ దిగుమతులు కారణంగా దేశీయ ఉత్పత్తిదారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఒక రిపబ్లికన్ నాయకుడు పేర్కొన్నాడు. దీంతో ట్రంప్ జోక్యం పుచ్చుకుని అమెరికన్ ఉత్పత్తిదారులను కాపాడేందుకు మరింత సుంకాలు మోపుదామని హెచ్చరించారు. ఈ సందర్భంగా భారత్, కెనడా దేశాల పేర్లను ప్రస్తావించారు.స్థానిక ఉత్పత్తిని ప్రోత్సహించడానికి కెనడా నుంచి వచ్చే ఎరువులపై.. భారత్ నుంచి వచ్చే బియ్యం డంప్‌పై అధిక సుంకాలు విదిద్దామని ట్రంప్ హెచ్చరించారు. ఇలా చేస్తేనే సమస్య పరిష్కారం అవుతుందని పేర్కొన్నారు.

గత దశాబ్దంలో భారత్-అమెరికా మధ్య వ్యవసాయ వాణిజ్యం సాగుతోంది. భారతదేశం నుంచి బాస్మతి, ఇతర బియ్యం ఉత్తత్తులు, సుగంధ ద్రవ్యాలు, సముద్ర వస్తువులు, బాదం, పత్తి, పుప్పుధాన్యాలను అమెరికా దిగుమతి చేసుంటుంది. ట్రంప్ సుంకాలు ప్రకటించేంత వరకు ఇరు దేశాల మధ్య సంబంధాలు బాగానే ఉన్నాయి. ఎప్పుడైతే అధిక సుంకాలు విధించారో అప్పటి నుంచే సంబంధాలు దెబ్బతిన్నాయి.

Tags:    

Similar News