MODI: మోదీ ఫ్రాన్స్ పర్యటన
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఫ్రాన్స్ జాతీయ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు.;
ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. నేటి నుంచి రెండ్రోజుల పాటు ఫ్రాన్స్‌లో పర్యటించనున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఫ్రాన్స్ జాతీయ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు.ఈ నెల 14న ప్యారిస్‌లో జరగనున్న నేషనల్ డే పరేడ్‌లో ప్రధాని మోదీ పాల్గొంటారు. భారత సైనిక బృందాలు కూడా పాల్గొంటున్న ఈ పరేడ్‌లో ప్రధాని మోదీ గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు.
ఫ్రాన్స్ అధ్యక్షుడితో దౌత్యపరమైన అంశాలపై ప్రధాని మోదీ సుదీర్ఘ చర్చలు జరుపనున్నారు. సెనెట్, నేషనల్ అసెంబ్లీ అధ్యక్షులతోనూ ప్రధాని సమావేశం కానున్నారు. ప్రవాస భారతీయులు, భారత్, ఫ్రెంచ్ సంస్థల సీఈవోలతో మోదీ భేటీ కానున్నారు. ఫ్రాన్స్ పర్యటన ముగిసిన తర్వాత ప్రధాని మోదీ జులై 15న తిరుగు ప్రయాణంలో యూఏఈలో పర్యటించనున్నారు. అక్కడ యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జయేద్‌తో మోదీ సమావేశమై ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరుపుతారని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది.