మావోయిస్టుల కాల్పుల విరమణ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్లు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఆయుధాలు వదిలేసి లొంగిపోయేందుకు ముందుకు వస్తే స్వాగతిస్తామన్నారు. దిల్లీలో నక్సల్ రహిత భారత్ సెమినార్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న అమిత్ షా.....అభివృద్ధి జరగకపోవడమే మావోయిస్టుల హింసకు కారణమన్న వామపక్షాల వాదనను తోసిపుచ్చారు. మావోయిస్టుల హింస వల్లనే దేశంలోని అనేకప్రాంతాలు దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోలేకపోయినట్లు చెప్పారు. మావోయిస్టుల హింసపై మౌనం వహించిన వామపక్షాలు..... ‘ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్’ను ప్రారంభించినప్పుడు మాత్రం మానవహక్కుల గురించి మాట్లాడటం మొదలుపెట్టాయని మండిపడ్డారు. మావోయిస్టు బాధితుల హక్కుల రక్షణకు ముందుకు రాని వారి సానుభూతిపరులు..... మావోయిస్టులను ఎందుకు రక్షించేందుకు యత్నిస్తున్నాయని అమిత్ షా ప్రశ్నించారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి నక్సలిజాన్ని తుదముట్టిస్తామని పునరుద్ఘాటించారు..