వరకట్న దురాచారాన్ని రూపుమాపాలి: UP సీఎం యోగీ ఆదిత్యనాథ్

Update: 2023-06-22 14:42 GMT


Uttarpradesh Chief Minister Yogi Adithyanath


కట్నం అనేది ఒక దురాచారం, దీనిని అరికట్టడానికి సమాజమంతా ఏకం కావాలి అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ అన్నారు. మహిళల భద్రత, గౌరవం, సాధికారత కోసం తమ డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.

"ముఖ్యమంత్రి సామూహిక వివాహం" పథకంలో భాగంగా గోరఖ్‌పూర్‌లో జరిగిన సామూహిక వివాహ వేడుకల్లో సుమారు 1500 జంటలు ఏకం అయ్యాయి. ఈ సందర్భంగా జంటలకు శుభాకాంక్షలు తెలుపుతూ, పలు అంశాలపై పత్రికా ప్రకటన విడుదల చేశారు.

ఈ సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. మహిళలను విస్మరించి ఏ సమాజం కూడా ముందుకు సాగలేదన్నారు. సగం జనాభా సాధికారత లేకుండా అభివృద్ధి అసాధ్యమని తెలిపారు.

‘‘సమాజ సాధికారత కోసం మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టాలి. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో, మహిళల గౌరవాన్ని నిలబెట్టడానికి, వారి సాధికారత కోసం మిషన్ మోడ్‌లో పని చేస్తోంది." అని అన్నారు.

సమాజంలో ఇప్పటికీ కొనసాగుతున్న వరకట్న దురాచారాన్ని అరికట్టేందుకు సామూహిక వివాహ పథకం విజయవంతమైందని ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు. వరకట్నం ఒక సాంఘిక దురాచారమని, వరకట్న రహిత సమాజం కోసం సమాజం భాగం కావాలని పిలుపునిచ్చారు.

ముఖ్యమంత్రి సామాజిక వివాహ యోజన కింద రాష్ట్ర ప్రభుత్వం 2017 నుంచి 2 లక్షలకు పైగా వివాహాలను నిర్వహించిందన్నారు. 2017కి ముందు, ప్రతి జంట పెళ్లికి రూ. 31,000 ఖర్చు చేయగా, తరువాత, ఇది రూ.51,000 కు పెంచబడింది. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం యొక్క సమిష్టి కృషేనన్నారు.

'రాష్ట్రంలో ముఖ్యమంత్రి కన్యా సుమంగళ యోజనను ఆడపిల్లలు పుట్టినప్పటి నుంచి గ్రాడ్యుయేషన్‌ వరకు చదివించడం కోసం అమలు చేస్తున్నామని, రాష్ట్రంలో మహిళల భద్రత కోసం 'మిషన్ శక్తి'ని అమలుచేస్తున్నామని గుర్తుచేశారు. 1947 నుండి 2017 వరకు, యూపీ పోలీసు శాఖలో మహిళా సిబ్బంది సంఖ్య 10,000 నుండి 40,000 కు పెరిగింది. 2017 నుండి, కేవలం ఆరేళ్లలో నాలుగు రెట్లు పెరిగిందని గుర్తుచేశారు.









Tags:    

Similar News