Uttara Pradesh : పెన్షన్ కోసం తండ్రి వితంతువుగా నాటకం
పదేళ్లుగా తండ్రి పెన్షన్ పొందుతున్న కూతురు
డబ్బు కోసం ఎలాంటి మోసాలు అయినా చేస్తారు అన్న విషయంలో తిరిగి ఆలోచించాల్సిన ప్రసక్తే లేకుండా చేస్తున్నాయి కొన్ని సంఘటనలు.. దానికి ఆడ, మగ, అన్న తేడా కూడా లేదు. ఉత్తరప్రదేశ్ లో ఓ మహిళ ఓ వింతైన మోసానికి పాల్పడింది. భర్త ఉన్నప్పటికీ ఆమె వితంతువుగా నటించింది. తండ్రి పెన్షన్ కోసం ఆమె ఈ మోసానికి పాల్పడింది. భర్త ఫిర్యాదుతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. అయితే భర్తకు ఈ విషయం తెలిసి చాలా కాలమైంది.. కానీ ఇప్పుడు బయట పెట్టడానికి కారణం వారి మధ్య జరిగిన గొడవ మాత్రమే. ఈ వింతైన సంఘటన ఎటా జిల్లాలో జరిగింది.
అలీగంజ్ కు చెందిన విజరత్ ఉల్లా ఖాన్ సర్వేయర్ గా పని చేసి రిటైర్డ్ అయ్యారు. భార్య సవియా అతనికంటే ముందుగానే చనిపోగా, 1987లో విజరత్ ఉల్లా ఖాన్ మరణించాడు. తండ్రి విజరత్ ఉల్లా ఖాన్ మరణం తర్వాత ఆయనకు వచ్చే పెన్షన్ డబ్బుల కోసం కుమార్తె మొహాసినా పర్వేజ్ ఓ ఘరానా మోసానికి తెర తీసింది. ఒక మృతుడి భార్యగా అంటే విడోగా నకిలీ పత్రాలు సృష్టించింది. భర్త మరణించిన మహిళకు మాత్రమే తండ్రి పెన్షన్ వచ్చే అవకాశం ఉండటం తో ఆమె ఈ ప్లాన్ వేసింది. గత పదేళ్లుగా ప్రభుత్వం నుంచి వచ్చిన తండ్రి పెన్షన్ సుమారు రూ.12 లక్షలు పొందారు. ఈ విషయం మొత్తం ఆమె ఆమె భర్తకు కూడా తెలుసు. అతను కూడా ఊరికనే వచ్చిన డబ్బులు వదులుకోవడం ఎందుకు అనుకున్నడేమో ఇన్నాళ్లు సైలెంట్ గానే ఉన్నాడు. ఇటీవల మొహాసినా పర్వేజ్, ఆమె భర్త మధ్య గొడవ జరిగింది. ఆ కోపం లో భార్య మోసం గురించి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మొహాసినాను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.