UP: పదే పదే కరిచే వీధి కుక్కలకు “జీవిత ఖైదు”. ఎక్కడంటే ?

కొత్త నిబంధనలను ప్రకటించిన యూపీ సర్కార్..

Update: 2025-09-18 01:30 GMT

 ఉత్తర్ ప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అక్కడి బీజేపీ ప్రభుత్వం మాఫియా, ఉగ్రవాదులు, గ్యాంగ్‌స్టర్లు, నేరస్తులకు వణుకు పుట్టిస్తోంది. ఇప్పటికే, పలువురు గ్యాంగ్‌స్టర్లు పోలీస్ ఎన్‌కౌంటర్లలో హతమయ్యారు. నేరాలు చేయాలంటే భయపడే పరిస్థితికి తీసుకువచ్చారు. అయితే, ఇప్పుడు యోగి ప్రభుత్వం తీసుకున్న మరో నిర్ణయం సంచలనంగా మారింది. కుక్కలు కూడా ప్రజలకు ఇబ్బందులు కలిగిసే కటకటాల్లో పెడతామంటూ కొత్త నిబంధనల్ని ప్రకటించింది.

దేశంలో వీధి కుక్కల దాడులు ఎక్కువ అవుతున్న తరుణంలో, యోగి ప్రభుత్వం ఈ నియమాలను తీసుకువచ్చింది. పదే పదే కరిచే కుక్కల్ని జీవితాంతం షెల్టర్లలో బంధిస్తామని ప్రభుత్వం గత వారం నిబంధనల్ని ప్రకటించింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలోని అన్ని కుక్కలకు స్టెరిలైజ్ చేసి, వాటిని షెల్టర్‌ హోమ్స్‌లో పెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించిన కొన్ని వారాల తర్వాత యూపీ సర్కార్ నుంచి ఈ ఉత్తర్వులు వచ్చాయి. గతంలో, సుప్రీంకోర్టు తీర్పుపై ‘‘యానిమల్ లవర్స్’’ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చాలా మంది సుప్రీంకోర్టు నిర్ణయాన్ని సమర్థించారు.

ప్రజా భద్రతకు సంబంధించి రాష్ట్రంలో జీరో-టాలరెన్స్ విధానాన్ని తీవ్రం చేస్తూ, పదే పదే ప్రజలపై దాడులు చేస్తూ, కరిచే వీధి కుక్కలను నిర్భందిస్తామని సెప్టెంబర్ 10న ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అన్ని పట్టణ, గ్రామ పాలన సంస్థలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ‘‘కుక్కలు రెచ్చగొట్టకుండా మనిషిని కరిచినట్లయితే, దానిని 10 రోజుల పాటు జంతు కేంద్రంలో ఉంచాలి. కుక్కకు స్టెరిలైజ్ చేస్తే, దానిని తీసుకువచ్చిన స్థానంలో వదిలేస్తారు. దానికి మైక్రో చిప్పింగ్ అమరుస్తారు. అదే కుక్క రెండోసారి కరిస్తే ఆ కుక్కను జీవితాంతం బంధించనున్నారు’’

Tags:    

Similar News