US: అగ్రరాజ్య ఆయుధం... భారత్‌కు జావెలిన్ బలం

మరింత బలంగా భారత్–అమెరికా సైనిక బంధం!.. ₹775 కోట్ల జావెలిన్ డీల్‌కు గ్రీన్ సిగ్నల్... భారత్‌కు వస్తున్న ‘ట్యాంక్ కిల్లర్’ జావెలిన్... ఫైర్-అండ్-ఫర్గెట్ జావెలిన్.. సైన్యానికి భారీ బూస్ట్*

Update: 2025-11-21 04:30 GMT

భారత్‌-అమెరికా రక్షణ భాగస్వామ్యంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. దాదాపు 93 మిలియన్‌ డాలర్ల (సుమారు ₹775 కోట్లు) విలువైన అధునాతన ఆయుధాలను భారత్‌కు విక్రయించేందుకు అమెరికా ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందంలో అత్యంత కీలకమైనది, ప్రపంచవ్యాప్తంగా తన సామర్థ్యాన్ని రుజువు చేసుకున్న జావెలిన్‌ క్షిపణి వ్యవస్థ మన దేశానికి అందనుంది.రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలో ఉక్రెయిన్‌ సైన్యానికి ‘దేవదూత’గా వ్యవహరించిన ఈ ట్యాంక్ విధ్వంసక ఆయుధం (Anti-Tank Guided Missile - ATGM) ఇప్పుడు భారత సైన్యం సత్తాను మరింత పెంచనుంది. భూతల దళాలకు, ముఖ్యంగా సరిహద్దుల్లో, పర్వత ప్రాంతాల్లో ట్యాంకుల విధ్వంసానికి ఇదొక గేమ్ ఛేంజర్ కానుందని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు

 జావెలిన్ ప్రత్యేకతలు

జావెలిన్ (FGM-148) అనేది భుజంపై నుంచి ప్రయోగించే, 'ఫైర్-అండ్-ఫర్గెట్' రకానికి చెందిన క్షిపణి. దీని ప్రత్యేకత ఏమిటంటే, క్షిపణిని ప్రయోగించే వ్యక్తి ప్రమాదంలో పడకుండా చూసే డిజైన్. షోల్డర్-ఫైర్ : దీనిని తీసుకెళ్లడం, ప్రయోగించడం సులభం. దీనిలో క్షిపణి, డిస్పోజబుల్ లాంచ్ ట్యూబ్, కమాండ్‌ కంట్రోల్‌ యూనిట్ ఉంటాయి. సెన్సర్లకు చిక్కకుండా: సాధారణంగా ట్యాంక్ విధ్వంసక క్షిపణిని ప్రయోగించినప్పుడు వెలువడే పొగ, వేడిని శత్రువుల సెన్సర్‌లు సులభంగా గుర్తిస్తాయి. కానీ జావెలిన్‌లో, తొలుత ఓ మోటార్ క్షిపణిని ట్యూబ్ నుంచి కొద్ది దూరం 'విసిరిన' తర్వాతే ప్రధాన క్షిపణి మోటార్ పనిచేయడం మొదలుపెడుతుంది. దీనిని సాఫ్ట్-లాంచ్ అంటారు. ఈ విధానం వల్ల, ఎక్కడి నుంచి ప్రయోగించారో శత్రువులకు కచ్చితంగా తెలియదు.

డబు­ల్ ఎటా­క్: ఇది ఆధు­నిక ట్యాం­కు­ల­పై ఉండే రి­యా­క్టి­వ్ ఆర్మ­ర్ రక్షణ కవ­చా­ల­ను సైతం ఛే­దిం­చ­గ­ల­దు. దీ­ని­లో రెం­డు దశ­ల్లో పే­లు­డు పదా­ర్థా­లు ఉం­టా­యి. తొలి దశలో కవ­చా­న్ని ఛే­దిం­చి, మలి­ద­శ­లో ట్యాం­కు­ను ధ్వం­సం చే­స్తుం­ది. ఈ 'టాం­డ­మ్ వా­ర్‌­హె­డ్' టె­క్నా­ల­జీ దీ­ని­ని అత్యంత శక్తి­మం­తం చే­స్తుం­ది.

టాప్ అటాక్ మోడ్: ఇది ట్యాంకుపై భాగం (Top) అత్యంత పలుచగా, బలహీనంగా ఉండే ప్రాంతంలో గురిపెట్టి దాడి చేస్తుంది.

వ్యూహాత్మక ప్రాధాన్యత

రష్యా­తో జరి­గిన పో­రా­టం­లో జా­వె­లి­న్ ఎంత ప్ర­భా­వ­వం­తం­గా పని­చే­సిం­దో ప్ర­పం­చం చూ­సిం­ది. ఉక్రె­యి­న్ సై­న్యం దీ­ని­ని ఉప­యో­గిం­చి వం­ద­లా­ది రష్య­న్ ట్యాం­కు­ల­ను ధ్వం­సం చే­సిం­ది. ఈ దె­బ్బ నుం­చి తప్పిం­చు­కో­వ­డా­ని­కి రష్యా తమ ట్యాం­కు­ల­కు లో­హ­పు బో­న్ల­ను అమ­ర్చా­ల్సిన పరి­స్థి­తి ఏర్ప­డిం­దం­టే దీని శక్తి­ని అర్థం చే­సు­కో­వ­చ్చు. ఉక్రె­యి­న్ పౌ­రు­లు కృ­త­జ్ఞ­త­గా తమ పి­ల్ల­ల­కు 'జా­వె­లి­న్', 'జా­వె­లి­నా' అని పే­ర్లు పె­ట్టు­కో­వ­డం ఈ ఆయు­ధం ప్రా­ధా­న్య­త­ను తె­లి­య­జే­స్తుం­ది.

భారత్‌కు బలమెంత?

ఈ ఒప్పందం కింద, 45.7 మిలియన్‌ డాలర్ల విలువైన జావెలిన్ ఎఫ్‌జీఎం-148 మిసైల్స్, 25 జావెలిన్ లైట్‌వెయిట్ కమాండ్‌ లాంఛ్ యూనిట్స్ (CLUలు) భారత్‌కు అందనున్నాయి. మిగిలిన 47.1 మిలియన్‌ డాలర్ల విలువతో ఎక్స్‌కాలిబర్ ప్రొజెక్టైల్స్‌, ఇతర సైనిక పరికరాలు విక్రయించనున్నారు.

Tags:    

Similar News