కాంగ్రెస్ సీనియర్ నేత కన్నుమూత..
కాంగ్రెస్ సీనియర్ నేత, యూపీ మాజీ గవర్నర్ అజీజ్ ఖురేషీ కన్నుమూశారు.;
ఉత్తరప్రదేశ్ మాజీ గవర్నర్, కాంగ్రెస్ సీనియర్ నేత అజీజ్ ఖురేషీ దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఖురేషీకి 83 ఏళ్లు, అతని బాగోగులు చూసే అతని మేనల్లుడు సుఫియాన్ అలీ అతని మరణ వార్తను వెల్లడించారు.
కొంతకాలంగా ఆరోగ్యం బాగోలేక భోపాల్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటల సమయంలో తుదిశ్వాస విడిచినట్లు ఆయన తెలిపారు. ఖురేషీ ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మిజోరం రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేశారు. 1972లో మధ్యప్రదేశ్‌లోని సెహోర్ స్థానం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై 1984లో లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికైనట్లు అలీ తెలిపారు. ఖురేషీ ఒంటరిగా ఉన్నారు. ఈరోజు సాయంత్రం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు అలీ తెలిపారు.