నేడు ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. NDA అభ్యర్థిగా సి.పి. రాధాకృష్ణన్, INDIA కూటమి అభ్యర్థిగా బి. సుదర్శన్ రెడ్డి పోటీలో ఉన్నారు. పోలింగ్ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 6 గంటల నుండి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అనంతరం ఫలితాలు వెలువడతాయి. ఉపరాష్ట్రపతిని లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు ఎన్నుకుంటారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు పార్టీ విప్ (whip) వర్తించదు, కాబట్టి సభ్యులు తమ ఇష్టానుసారం ఓటు వేయవచ్చు. అయితే, సాధారణంగా పార్టీల అభ్యర్థులకే ఓటు వేస్తుంటారు. ఈ ఎన్నికల్లో ప్రతి ఓటుకు ఒకే విలువ ఉంటుంది. విజయం సాధించడానికి అభ్యర్థికి 50 శాతం ప్లస్ వన్ ఓట్లు అవసరం. మొత్తం పార్లమెంటు సభ్యుల సంఖ్య 781. వీరిలో లోక్‌సభ నుండి 542 మంది, రాజ్యసభ నుండి 239 మంది ఉన్నారు. ఎన్డీయే కూటమికి 427 మంది ఎంపీల మద్దతు ఉంది, ఇది విజయం సాధించడానికి అవసరమైన 391 ఓట్ల కంటే ఎక్కువ. యూపీఏ కూటమికి 354 మంది ఎంపీల మద్దతు ఉంది. బిజూ జనతా దళ్ (బి.జె.డి), భారత్ రాష్ట్ర సమితి (బి.ఆర్.ఎస్) ఈ ఎన్నికలకు దూరంగా ఉంటాయని ప్రకటించాయి. ఎన్డీయేకు వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందని తెలిపింది