Vijayashanthi : ఢిల్లీలో విజయశాంతి.. ఎమ్మెల్సీ సీటు కోసం లాబీయింగ్

Update: 2025-03-06 10:00 GMT

మాజీ ఎంపీ విజయశాంతి మళ్లీ యాక్టివ్ అయ్యారు. కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉంటూ వస్తున్న విజయశాంతి.. ఢిల్లీలో కనిపించారు. కాంగ్రెస్ పెద్దలను ఆమె కలుస్తున్నట్లు సమాచారం. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను విజయశాంతి కలిసినట్లు సమాచారం. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీటు కోసం ఆమె ప్రయత్నం చేస్తున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ నేతలు మరోసారి ఢిల్లీకి వెళ్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి రెండు రోజుల పాటు అక్కడే ఉండనున్నారు. ఈ నేపథ్యంలో విజయశాంతి ఢిల్లీలో కాంగ్రెస్‌ పెద్దలను కలుస్తుండటంతో ఆమెకు ఎమ్మెల్సీ స్థానం ఇస్తారనే చర్చ జరుగుతోంది. సీఎం రేవంత్‌రెడ్డిని కలువకుండానే కాంగ్రెస్‌ హై కమాండ్‌ నేతలతోనే విజయశాంతి చర్చలు జరపడంపై రాజకీయంగా చర్చ జరుగుతోంది.

Tags:    

Similar News