Terrorist Attacks : కాశ్మీర్ లో ఉగ్రకల్లోలం.. ఎప్పుడు ఏం జరిగిందంటే?

Update: 2025-04-23 12:00 GMT

1) 8 జూన్ 2024: మాతా వైష్ణోదేవి ఆలయ బేస్ క్యాంపు యాత్రికులతో వెళ్తున్న బస్సుపై ఉగ్రవాదు లు దాడిచేశారు. ఈ ఘటనలో 10 మంది మరణించగా, 33 మంది గాయపడ్డారు. ఇదే ఏడాది నవంబర్ 3న శ్రీనగర్ మార్కెట్పై జరిగిన దాడిలో 12మంది మృత్యువాతపడ్డారు.

2) మే 2022: కాట్రా నుండి జమ్మూకు వెళ్తున్న బస్సులో ఉగ్రవాదులు అమర్చిన బాంబు కారణంగా మంటలు చెలరేగడంతో నలుగురు యాత్రికులు మరణించగా, 24 మంది గాయపడ్డారు.

2019 ఫిబ్రవరి 14: పుల్వామాలో జరిగిన దాడి యావత్ దేశాన్ని కలవరపాటుకు గురిచేసింది. సైని కుల వాహనంపై ముష్కరులు దాడిచేశారు. 40 మంది సీఆర్పీఎఫ్ సైనికులను పొట్టనపెట్టుకున్నారు.

4) 10 జూలై 2017: దక్షిణ కాశ్మీర్ లోని శ్రీనగర్- జమ్ము జాతీయ రహదారిపై అనంతనాగ్ సమీపంలో దుర్ఘటన జరిగింది. బోటెంగో గ్రామం వద్ద 56 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సుపై ఉగ్రవాదులు దాడి చేయడంతో ఏడుగురు అమర్నాథ్ యాత్రికులు మరణించగా, 15 మంది గాయపడ్డారు. జూన్లో జరిగిన మరొక ఘటనలో 9 మంది నేపాల్, బీహారీ కూలీలు ప్రాణాలు కోల్పోయారు.

5) 21 జూలై 2006: గండేర్ బల్ లోని బీహామా

సమీపంలో ఉగ్రవాదులు బస్సుపై గ్రెనేడ్లతో దాడి చేయడంతో ఐదుగురు మరణించారు. బాల్తాల్ బేస్ క్యాంప్ నుండి బస్సు తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. జూన్ 12న కుల్గాంలో యాత్రికుల బస్సుపై

దాడి ఘటనలో 8 మంది మరణించారు.

6) 13 జూన్ 2005: పుల్వామాలోని ఓ ప్రభుత్వ పాఠశాల ముందున్న రద్దీ మార్కెట్లో కారుదాడిలో

13మంది మరణించారు.

7) 23 మార్చి 2003: లో పుల్వామా జిల్లాలోని నది మార్గ్ గ్రామంలో లష్కరే తోయిబా ఉగ్రవాదులు 24 మంది హిందూ కాశ్మీరీ పండిట్లను హత్య చేశారు.

పహల్గామ్ సమీపంలోని నువ్వాన్ బేస్ క్యాంప్పై ఉగ్రవాదులు దాడిచేశారు.

ఆరుగురు యాత్రికులు, ముగ్గురు పౌరులు సహా తొమ్మిది మంది మరణించారు.

8) 2002 నవంబర్ 23: జమ్ము-కాశ్మీర్ జాతీయ రహదారిపై దక్షిణ కాశ్మీర్లోని లోయర్ ముండా ప్రాంతంలో ముష్కరులు ఐఈడీతో విధ్వంసానికి పాల్పడ్డారు. 19మందిని పొట్టనబెట్టుకున్నారు.

9) 2001 జూలై 20: శేషనాగ్ సరస్సు సమీపంలోని యాత్రికుల శిబిరంపై ఓ ఉగ్రవాది గ్రనేడ్లు విసిరాడు. ఆ తర్వాత విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. 13 మంది మరణించారు.

10) 2001 అక్టోబర్ 1: శ్రీనగర్ లోని అసెంబ్లీ కాంప్లెక్స్పై ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో 36 మంది మరణించారు.

11) 2000 మార్చి 21: అనంతనాగ్ జిల్లాలోని ఛత్తీసింగ్పర గ్రామంలో సిక్కు వర్గంపై కాల్పుల్లో 36 మంది ప్రాణాలు కోల్పోయారు.

12) ఆగస్టు 2: పహల్గామ్ ని బేస్ క్యాంప్పై దాడి. అమర్నాథ్ యాత్ర చరిత్రలో ఇది అతిపెద్ద ఘటన. రెండు గంటల పాటు జరిగిన కాల్పుల్లో 21 మంది యాత్రికులు, ఏడుగురు స్థానిక దుకాణ దారులు సహా 32 మంది మరణించారు. 60 మంది గాయపడ్డారు.

13) 1998 జూలై 28: యాత్రికుల బృందంపై ఉగ్రదాడిలో 20 మంది మరణించారు.

14) 1994 ఆగస్టు 2: పహల్గామ్ లోని బేస్ క్యాంప్ లో ఐదుగురు యాత్రికులను చంపారు. 15) 1983 ఆగస్టు 15: యాత్రికుల కాన్వాయ్ పై దాడి జరిగింది. 8మంది మరణించారు.

Tags:    

Similar News