Union Budget : కేంద్ర బడ్జెట్ 2024 కాపీలు కావాలా.. ఈ యాప్, సైట్ లో చూడండి
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ 2024ను కూడా పేపర్ రహిత పద్ధతిలోనే సమర్పించబడుతుంది. బడ్జెట్ పత్రాలు హిందీ, ఇంగ్లీష్ లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. కేంద్ర బడ్జెట్ కు సంబంధించిన అన్ని పత్రాలు 'యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్'లో అందుబాటులో ఉంటాయి.
పార్లమెంట్ సభ్యులు, సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బడ్జెట్ పత్రాలు అందుతాయి. 'యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్' ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్ ఫామ్స్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. యూనియన్ బడ్జెట్ వెబ్ పోర్టల్ (www.indiabudget.gov.in) నుంచి కూడా యాప్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ ను నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (నిక్) డెవలప్ చేసింది.
ఈ యాప్ ను ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఆర్థిక వ్యవహారాల విభాగం (డీఈఏ) పర్యవేక్షిస్తుంది. బడ్జెట్ ను సమర్పించిన కొద్దిసేపటికే అన్ని పత్రాలు ఈ యాప్ లో అందుబాటులోకి వస్తాయి. ఇక్కడినుంచే నేరుగా డౌన్ లోడ్ చేసుకుని బడ్జెట్ స్పీచ్, బడ్జెట్ కేటాయింపులను ట్రాక్ చేయొచ్చు. మీడియాలో ఉన్నవారికి, బడ్జెట్ ను విశ్లేషించేవారికి ఈ డాక్యుమెంట్లు బాగా ఉపయోగపడతాయి.