పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయడానికి కేంద్రం కట్టుబడి ఉందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వెల్లడించారు. ప్రాజెక్టు నిర్మాణానికి తాజాగా రూ.12వేల కోట్లు కేటాయించినట్లు బడ్జెట్ సమావేశాల ప్రారంభ ప్రసంగంలో తెలిపారు. అభివృద్ధి ఫలాలు దేశ ప్రజలందరికీ అందాలనేదే తమ లక్ష్యమన్నారు. భారత్‌ను గ్లోబల్ ఇన్నోవేషన్ పవర్ హౌస్‌గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు.
దేశాభివృద్ధి కోసం వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చెప్పారు. వన్ నేషన్-వన్ ఎలక్షన్ దిశగా అడుగులు వేస్తున్నామని పార్లమెంట్ ప్రసంగంలో తెలిపారు. ఇప్పటి వరకు 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చినట్లు వెల్లడించారు. త్వరలోనే దేశం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందన్నారు. రైతులు, మహిళలు, పేదలు, యువతకు ప్రాధాన్యతనిస్తూ బడ్జెట్‌లో కేటాయింపులు ఉంటాయని తెలిపారు.