Indian Ministry : పాక్ కవ్వింపులకు జవాబిస్తున్నాం.. అంతే : భారత విదేశాంగ శాఖ

Update: 2025-05-10 12:30 GMT

పాకిస్థాన్‌ పదే పదే కవ్వింపు చర్యలు దిగుతోదన్నారు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రి. భారత్‌లోని జనసమూహాలే లక్ష్యంగా దాడులకు పాల్పడుతోందన్నారు. పాక్‌ చర్యలు రెచ్చగొట్టే విధంగా, ఉద్రిక్తతలు పెంచే విధంగా ఉన్నాయన్నారు. తమ S-400 క్షపణి వ్యవస్థను పాక్‌ ధ్వంసం చేసిందని అవాస్తవాలు ప్రచారం చేస్తోందన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌ తమ లక్ష్యం కాదని ఎవరి లక్ష్యమో అందరికీ తెలుసన్నారు. గత రాత్రి భారత్‌ సరిహద్దులవెంట 26 ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని పాక్‌ డ్రోన్లతో దాడికి యత్నించిదన్నారు కల్నల్‌ సోఫియా ఖురేషి. శ్రీనగర్, అవంతిపుర, భటిండా ప్రాంతాల్లో భారత్‌ రక్షణ వ్యవస్థను లక్ష్యంగా పాక్‌ చేసిన దాడిని తమ ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టం సమర్థంగా తిప్పికొట్టిందన్నారు. ఆలయాలు, జనావాసాలు, పాఠశాలలపై నిరంతరం దాడులకు పాల్పడుతోందని, దేశ సార్వభైమత్వాన్ని రక్షించుకునేందుకు తమ బలగాలు కృత నిశ్చయంతో ఉన్నాయన్నారు.

Tags:    

Similar News