మాంసంలో విషం కలిపి దాదాపు 2,800 కుక్కలను చంపాము: కర్ణాటక MLC అంగీకారం

కర్ణాటక శాసన మండలిలో జరిగిన ఒక ఉత్కంఠభరితమైన ప్రకటన వీధి కుక్కల నియంత్రణపై చర్చను మళ్ళీ లేవనెత్తింది.;

Update: 2025-08-14 06:46 GMT

వీధి కుక్కలపై సుప్రీం కోర్టు తన వాదనను వెలిబుచ్చిన తరువాత జంతు ప్రేమికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైతే, సుప్రీం తీర్పు పట్ల సంతోషం వ్యక్తం చేసినవారు కూడా ఉన్నారు. వీధి కుక్కల బారిన పడి పసిబిడ్డల నుంచి పెద్ద వారి వరకు ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు వెలుగు చూడడంతో సుప్రీం కఠిన చర్యలు అవలంభించాలని కోరింది. ఇదిలా ఉండగా కర్ణాటక శాసన మండలిలో జరిగిన ఒక ఉత్కంఠభరితమైన ప్రకటన వీధి కుక్కల నియంత్రణపై చర్చను మళ్ళీ లేవనెత్తింది.

జనతాదళ్ (సెక్యులర్) ఎమ్మెల్సీ ఎస్ఎల్ భోజేగౌడ తాను చిక్కమగళూరు పౌర సంస్థ అధిపతిగా ఉన్న కాలంలో, "పిల్లలను రక్షించడం" పేరుతో మాంసంలో విషం కలిపి దాదాపు 2,800 కుక్కలను చంపామని బహిరంగంగా అంగీకరించారు.

"మన పిల్లల భద్రత కోసం అవసరమైతే జైలుకు కూడా వెళ్దాం" అని భోజేగౌడ ప్రకటించారు. వీధి పై కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన మొదటి రాష్ట్రంగా కర్ణాటక అవతరించాలని కోరారు. ఇటువంటి హత్యలు చట్టవిరుద్ధమైనవి, అనైతికమైనవి అని వాదించే కార్యకర్తలలో ఆగ్రహాన్ని రేకెత్తించారు.

గత నెలలో కోడిగెహల్లిలో 70 ఏళ్ల వృద్ధుడిని వీధి కుక్కలు చంపేశాయి. ఓల్డ్ హుబ్బళ్లిలో, మూడేళ్ల బాలికపై జరిగిన దారుణమైన దాడిని సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి. బెంగళూరులోని ఇద్దరు ఎంఎస్సీ విద్యార్థులు కూడా ఇటీవల తమ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో వీధి కుక్కల దాడి కారణంగా ఆసుపత్రి పాలయ్యారు.




Tags:    

Similar News