Kishan Reddy : మేం తప్పుడు మోడల్ అనుసరించం : కిషన్ రెడ్డి

Update: 2025-05-02 05:15 GMT

కులగణనతో అన్ని సామాజిక వర్గాలకు మేలు జరుగుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. 2011 జనగణనలో కుల గణన చేపట్టాలని 2010లోనే బీజేపీ తరపున సుస్మా స్వరాజ్ అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ లకు లేఖ రాశారని గుర్తు చేశారు. సుస్మా స్వరాజ్ ఇచ్చిన లేఖకు కట్టుబడి నిర్ణయం తీసుకున్న ట్లు తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ నేతృ త్వంలోని కేంద్ర ప్రభుత్వం తప్పుడు మోడల్ అనుసరించదని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. నిన్నటి క్యాబినెట్ భేటీలో జనగణనలో కులగణన చేపట్టాలని మోదీ తీసుకున్న నిర్ణయం చరిత్ర పుటల్లో నిలుస్తుందన్నారు. బీజేపీ బీసీ వర్గానికి చెందిన మోదీని ప్రధానిని చేసిందన్నారు. ఎస్సీ వర్గీకరణకు పరిష్కారం చూపిన పార్టీగా పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రధానిని కులం పేరుతో దూషించిందని విమర్శించారు. ముస్లింలను బీసీల్లో చేర్చే కుట్ర చేసిందన్నా రు. ఎస్సి, ఎస్టీ రాష్ట్రపతి అభ్యర్థిత్వాన్ని వ్యతి రేకస్తూ ఆ పార్టీ పోటీ చేసిందన్నారు. బీసీల పట్ల మొసలి కన్నీరు కార్చడం తప్ప ఆ పార్టీ చేసిందేమీ లేదన్న కిషన్ రెడ్డి.. బీసీ కమిషన్ ఏర్పాటు చేసిన ఘనత మోదీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. 'సబ్ కా సాత్ సబ్ కా వికాస్ లో భాగంగా 10 శాతం రిజర్వేషన్లు దక్కని వారికి కూడా రిజర్వేషన్లు కల్పించాం. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు, ముస్లిం మహిళలకు త్రిబుల్ తలాక్ రద్దు వంటి ఎన్నో నిర్ణయాలు తీసుకున్నాం. కులగణన కాంగ్రెస్ వ్యతిరేకం. మొదటి జనగణ నలో కులగణన చేసారు. బీసీల కంటే ముస్లింలే వెనకబడి ఉన్నా రని వారిని ఆదు కోవాలని మా ట్లాడిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ ది. రాజీవ్ గాంధీది. బీసీలను  పక్కనపెట్టి ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించా రు' అని విమర్శించారు.

Tags:    

Similar News