West Asia War Impact on India : యుద్ధం ఎఫెక్ట్.. గ్యాస్ కష్టాలు మొదలయ్యాయా..?
పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్ భారత్ ను బలంగానే తాకుతున్నట్టు కనిపిస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలపై ఇప్పటి వరకు ఎలాంటి ఎఫెక్ట్ పడలేదు. అయితే గ్యాస్ ధరలను మాత్రం కేంద్రం ఇప్పటికే రూ.60 దాకా పెంచారు. అంతే కాకుండా బుకింగ్ విధానాలపై కూడా రకరకాల మార్పులు చేస్తున్నారు. యుద్ధం మొదలు కాకముందు గ్యాస్ బుకింగ్ పీరియడ్ 15 రోజులు మాత్రమే ఉండేది. కానీ మూడు రోజుల క్రితం దాన్ని 21 రోజులకు పెంచారు. ఎందుకంటే యుద్ధం వల్ల చాలా మంది ముందస్తు బుకింగ్ లు చేసుకుంటున్నారంట. అవసరం లేకపోయినా అదనంగా బుకింగ్ లు చేసుకుని నిల్వ ఉంచుకోవాలని చూస్తున్నారని.. దాని వల్ల అర్హులైన వారికి గ్యాస్ అందకుండా పోతోందని అధికారులు ఇలా చేశారు. అయినా సరే అదనపు బుకింగ్ లు ఆగకుండా వస్తూనే ఉన్నాయి.
గతంలో రెగ్యులర్ గా వచ్చే బుకింగ్ ల కంటే 21 శాతం అదనంగా వస్తున్నాయంట ఆర్డర్లు. దీంతో 25 రోజులకు పీరియడ్ ను పెంచాయి చమురు కంపెనీలు. ఇలా అయినా అదనపు బుకింగ్ లు ఆగుతాయని అనుకుంటున్నారు. కానీ చమురు దిగుమతులు భారీగా తగ్గిపోవడంతో గ్యాస్ సరఫరా మీద ఎఫెక్ట్ పడుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు భారత్ వద్ద ఉన్న గ్యాస్ నిల్వలతో నెట్టుకొస్తున్నారు. అందుకే ధరలు కూడా పెంచేస్తోంది కేంద్రం. కానీ యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు.
ఈ లెక్కన గ్యాస్ ధరలు కూడా త్వరలోనే భారీగా పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది. గ్యాస్ కొరత కూడా ఏర్పడేలా ఉందని అంటున్నారు ట్రేడ్ నిపుణులు. ఇప్పటి వరకు భారత్ లో ఇలాంటి గ్యాస్ కొరత రాలేదు. ఇరత దేశాల నుంచి దిగుమతి చేసుకునేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. కానీ గల్ఫ్ తో పాటు ఇరాన్ దేశాల నుంచి దిగుమతి చేసుకునేంత స్థాయిలో ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం కష్టమే అంటున్నారు ట్రేడ్ నిపుణులు. మరి యుద్ధం ఇలాగే కొనసాగితే.. గ్యాస్ మీద ఎలాంటి సంక్షోభం ఎదురవుతుందో చూడాలి.